ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన హమాస్.. 20 సూత్రాల ప్రణాళికకు అంగీకారం

గాజా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ప్రకారం.. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది.

New Update
BREAKING

BREAKING

గాజా యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ప్రకారం.. ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో హమాస్ తమ ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాలని, ఆయుధాలు విడిచిపెట్టి, పాలన నుంచి తప్పుకోవాలని ప్రధానంగా సూచించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే అంగీకరించారు.

ఈ ప్రణాళికను అంగీకరించకపోతే 'ఎవరూ చూడని నరకం' తప్పదని ట్రంప్ హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ తలొగ్గింది. బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తుల చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు తాము సిద్ధమని కూడా హమాస్ ప్రకటించింది. అయితే, ప్రణాళికలోని కొన్ని అంశాలపై పాలస్తీనా వర్గాలతో మరింత సంప్రదింపులు అవసరమని పేర్కొంది.

ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్, అనేక ముస్లిం దేశాల నుంచి మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ సుముఖత చూపడం శాంతి దిశగా వేసిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. త్వరలోనే తుది ఒప్పందం కుదిరి, గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు