Bird Flu : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారుల కీలక ఆదేశాలు!
పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.