/rtv/media/media_files/2025/02/11/aKwmxhrOZsEEB6JLPuES.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఆయన నిర్ణయాలతో ప్రపంచంలో అన్నీ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. హమాస్, ఇజ్రాయిల్ దాడులు ఆగిపోయాయనుకునేలోగా మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేయాలి. అయితే కొంతమంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించింది. దీంతో ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా పెద్దన్న ట్రంప్ రంగంలోకి దిగాడు. శనివారం మధ్యాహ్నం లోగా బందీలను వదలకపోతే హమాస్ (Hamas) ను సర్వనాశనం చేస్తానని హెచ్చరించాడు.
ఇది కూడా చదవండి: రాత్రంతా గిన్నెలను సింక్‌లోనే ఉంచుతున్నారా.. ఈ పొరపాటు చేయొద్దు
Also Read : ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. !
Trump Declared War On Hamas
గాజా (Gaza) కి సాయం చేయకపోవడం, కాల్పుల విరమణ నిబంధనలను ఇజ్రాయెల్ (Israel) నిలబెట్టుకోవడంలో విఫలమైందని హమాస్ ఆరోపించింది. దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం ఇది రెండోసారి. అమెరికా వైట్‌హౌస్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఆరునూరైనా గాజాను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. హమాస్‌కు 72 గంటల టైం డెడ్‌లైన్ ఇచ్చాడు ట్రంప్. యుద్దంలో పట్టుబడిన ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను వదలకుంటే.. హమాస్‌తో యుద్ధానికి దిగుతామని తెగేసి చెప్పాడు అమెరికా అధ్యక్షుడు.
Also Read: Big Breaking: రామమందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత!
అక్టోబర్ 7, 2023న హమాస్ పట్టుకున్న 251 మంది బందీలలో 73 మంది ఇంకా గాజాలో బందీలుగానే ఉన్నారు. వారిలో 34 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. మిగిలిన వారిని 6 వారాల కాల్పుల విరమణ సమయంలో విడుదల చేశారు. ఇజ్రాయెల్ వద్ద ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా బందీలను మార్పిడి చేశారు. ఇటీవలి విడుదల గత శనివారం జరిగింది. హమాస్ 183 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన బందీలను విడిపించింది. శనివారం లోగా మిగిలిన బందీలను హమాస్ విడుదల చేయకుంటే.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం నుండి వైదొలిగి సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. అటు హమాస్ మాత్రం ట్రంప్ మాటలను బెదిరింపులుగానే చూస్తామని తేల్చి చెప్పింది.
Also Read : రాంచరణ్ Vs అల్లు అర్జున్.. తొలిసారిగా భయటపడ్డ విభేదాలు.. ఇదిగో ప్రూఫ్!