/rtv/media/media_files/2025/02/11/sdOudH9qqhNPyXa1BThB.jpg)
monkey
అసలే కోతి..ఆపై కల్లు తాగింది అనే సామెత అందరికీ తెలిసిన విషయమే. కోతులు (Monkeys) అవి చేసే రచ్చ గురించి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఓ కోతి కల్లు తాగాకపోయినప్పటికీ కూడా ఓ దేశ ప్రజలందరికీ అంధకారంలోకి నెట్టింది.అది ఏ దేశమో కాదు..శ్రీలంకే. ఓ కోతి చేసిన పని వల్ల దేశ వ్యాప్తంగా కరెంట్ పోయింది. అసలు కోతి వల్ల కరెంట్ పోవడం ఏంటి...అసలేం జరిగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Aslo Read: LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్
శ్రీలంక (Sri Lanka) లో ఆదివారం.. దేశవ్యాప్తంగా కరెంట్ బంద్ (Power Cut) అయింది. ఒక్కసారిగా దేశం మొత్తం విద్యుత్ నిలిచిపోవడంతో.. ప్రజలు అంతా తీవ్ర సమస్యలు ఎదుర్కున్నారు. ఆసుపత్రులు, కార్యాలయాల్లో కూడా ఒక్కసారిగా పనులన్నీ నిలిచిపోయాయి. ముఖ్యంగా అత్యవసరం అనుకున్న వాళ్లంతా జనరేటర్లనపైనే ఆధార పడాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలకు కరెంట్ పోగా.. రాత్రయినా రాలేదు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. విద్యుత్ సంబంధిత ఆఫీసర్లకు ప్రజలు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. అలాగే అనేక మంది సోషల్ మీడియా వేదికగా కరెంటు లేదంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. దీనిపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది అసలు సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు పెద్ద ఎత్తునే చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు శ్రమించగా.. కరెంటు పోవడానికి గల కారణాన్ని కనుగొన్నారు.
కోతి గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను
అయితే ఇదే విషయాన్ని శ్రీలంక విద్యుత్ శాఖ మంత్రి కుమార జయకోడి వెల్లడించారు. ముఖ్యంగా ఒక కోతి తమ గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకిందని.. దాని వల్లే వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడి దేశ వ్యాప్తంగా కరెంట్ పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం విన్న ప్రజలు అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.
కొలంబోలోని ఒక సబ్ స్టేషన్‌లోకి ప్రవేశించిన కోతే.. దేశ వ్యాప్తంగా విద్యుత్ పోవడానికి కారణమా అంటూ ఓ నెటిజెన్ తన మనసులోని ప్రశ్నను అడిగాడు. అలాగే మరో వ్యక్తి.. ఒక కోతి=మొత్తం గందరగోళం అంటూ కామెంట్ చేశారు. శ్రీలంక జాతీయ విద్యుత్ గ్రిడ్ చాలా బలహీనమైన స్థితిలో ఉందని.. ఏ ఒక్క లైన్‌లో సమస్య ఏర్పడినా దేశ వ్యాప్తంగా విద్యుత్ స్తంభించిపోతుందని ఓ ఇంజినీర్ వివరించాడు. 2022లో ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంక విస్తృతంగా విద్యుత్ సరఫరాను కోల్పోయిన సంగతి తెలిసిందే.
Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!
Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!