BIG BREAKING: బ్రిటన్ ప్రధానికి హెచ్‌ఐవీ టెస్ట్‌.. !

బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

New Update
starmer

starmer

బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. హెచ్‌ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా టెరెన్స్‌ హిగ్గిన్స్‌ ట్రస్ట్‌ తో కలిసి ప్రధాన మంత్రి స్టార్మర్‌ ర్యాపిడ్ హోమ్‌ టెస్టు చేయించుకున్నట్లు ప్రకటించింది.

Also Read: Sri Lanka: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్‌ కట్‌.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?

స్వయంగా టెస్ట్...

హెచ్‌వీఐ పరీక్ష (HIV Test) గురించి అవగాహన పెంచడానికి టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారితో కలిసి ఇంట్లోనే స్టార్మర్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్మర్ స్వయంగా టెస్ట్ చేయించుకోవడం విశేషం. ఈ సందర్భంలగా దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్‌ వ్యాధి - టీకా కనుగొన్న భారత్‌ బయోటెక్‌

ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్‌ మాట్లాడుతూ..హెచ్‌ఐవీ పరీక్ష ఎంతో ముఖ్యమైనదని..అందులో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపించిందని తెలిపారు. కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను ఒక వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.2030 నాటికి  కొత్త హెచ్‌ఐవీ కేసులు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్మర్‌...ఆ లక్ష్యాన్ని చేరేందుకు ప్రజలు ముందుకొచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. 

Also Read:Maha Kumbh Mela: 350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్‌...గూగుల్‌ మ్యాప్‌ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!

Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్‌..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు