సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంలో మొదలైన చిచ్చు ఆగడం లేదు. సరస్వతి పవర్ కంపెనీ (Saraswati Power Company) లో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ ను కోరారు. తాజాగా మంగళవారం ఇద్దరు విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
ఈ సందర్భంగా కౌంటర్లో విజయమ్మ (YS Vijayamma) సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. పిల్లల మధ్య వివాదం కారణంగా తాను ఇలా కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, భారతి ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఫ్యామిలీ సెటిల్మెంట్‌లో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదని తెలిపారు. విజయమ్మ, షర్మిల తరఫున విశ్వరాజ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను 2025 మార్చి 6కు వాయిదా వేసింది.
ఇక సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని వైఎస్ జగన్ పిటిషన్ లో వెల్లడించారు. భవిష్యత్తులో తన సోదరి షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్ట్ 31న ఒప్పందం చేసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తనకు తెలియకుండానే, బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే తన తల్లి, సోదరి షేర్లను బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని, షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ను కోరారు.
YS Vijayamma: వైఎస్ ఫ్యామిలీలో ఆగని రచ్చ .. NCLTలో విజయమ్మ, షర్మిల కౌంటర్
సరస్వతి పవర్ కంపెనీలో తన మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మంగళవారం విజయమ్మ, షర్మిల విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
ys jagan
మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంలో మొదలైన చిచ్చు ఆగడం లేదు. సరస్వతి పవర్ కంపెనీ (Saraswati Power Company) లో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ జగన్ గతేడాది ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది ట్రైబ్యునల్ ను కోరారు. తాజాగా మంగళవారం ఇద్దరు విడివిడిగా కౌంటర్ ధాఖలు చేశారు.
Also Read : 'సంతాన ప్రాప్తిరస్తూ'.. డాక్టర్ భ్రమరం వచ్చేశాడు.. పోస్టర్ వైరల్!
విజయమ్మ సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా కౌంటర్లో విజయమ్మ (YS Vijayamma) సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. పిల్లల మధ్య వివాదం కారణంగా తాను ఇలా కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, భారతి ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఫ్యామిలీ సెటిల్మెంట్‌లో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీకి లేదని తెలిపారు. విజయమ్మ, షర్మిల తరఫున విశ్వరాజ్ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ తదుపరి విచారణను 2025 మార్చి 6కు వాయిదా వేసింది.
Also Read : వరంగల్ కు రాహుల్ గాంధీ.. ఏంటీ సడన్ టూర్ ?
Also Read : రోజూ కిలో మీటరు నడిస్తే.. ఈ సమస్యలన్నీ పరార్
ఇక సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని వైఎస్ జగన్ పిటిషన్ లో వెల్లడించారు. భవిష్యత్తులో తన సోదరి షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్ట్ 31న ఒప్పందం చేసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తనకు తెలియకుండానే, బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే తన తల్లి, సోదరి షేర్లను బదిలీ చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని, షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని ట్రైబ్యునల్ ను కోరారు.
Also Read : Delhi BJP : ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!