BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీఆర్‌ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది.
kcr vs revanth
Feb 11, 2025 13:47 IST
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు!
కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది.
Rahul Gandhi
Feb 11, 2025 12:57 IST
కాకినాడ జిల్లాలో విషాదం.. ప్రాణాలు తీసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థి
కాకినాడ జిల్లాలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kakinada Photograph: (Kakinada)
Feb 11, 2025 12:56 IST
తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారులు కీలక ఆదేశాలు!
పక్క రాష్ట్రల్లో బర్డ్ ప్లూ వైరస్ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ లోని అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్లను రక్షించడానికి చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిపై ప్రజలలో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు.
bird flu telangana
Feb 11, 2025 12:55 IST
బ్రిటన్ ప్రధానికి హెచ్‌ఐవీ టెస్ట్.. !
Feb 11, 2025 11:04 IST
వరంగల్ కు రాహుల్ గాంధీ.. ఏంటీ సడన్ టూర్ ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణాకు రానున్నారు. సాయంత్రం 5:30కు రాహుల్ వరంగల్ జిల్లా హన్మకొండకు చేరుకోనున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై.. తిరిగి రాత్రి 7:30కు తమిళనాడుకు బయలుదేరనున్నారు.
rahul ghandii
Feb 11, 2025 11:01 IST
ఓపెన్ ఏఐ కు భారీ ఆఫర్ ఇచ్చిన మస్క్...మీరే ఎక్స్ ను అమ్మండన్న శామ్ వాల్టన్
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈఓ వామ్ వాల్టన్ కు మధ్య మంచి ఫైట్ అయింది. ఓపెన్ ఏఐను కొనుగోలు చేస్తామని మస్క్ భారీ ఆఫర్ ఇస్తే..మీరే ఎక్స్ ను అమ్మేయండి అంటూ శామ్ వాల్టన్ చురకలంటించారు.
Elon Musk, Sam Altoman
Feb 11, 2025 11:01 IST
ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత అధికారం.. బీజేపీ ముందున్న పది సవాళ్లు ఇవే!
ఢిల్లీలో బంపర్ విక్టరీ కొట్టింది బీజేపీ. 48 సీట్లతో విజయఢంకా మోగించింది. దీంతో 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో కమలం పార్టీ పాగా వేసింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ముందు పది అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి.అవెంటో ఈ ఆర్టికల్ లో చదవండి.
delhi bjp
Feb 11, 2025 10:01 IST
ఏంటీ నిజమా.. రూ. 200 నోటును బ్యాన్ చేస్తున్నారా.. ఆర్బీఐ కీలక ప్రకటన!
ఇటీవల మార్కెట్లో రూ.200, రూ.500 నకిలీ నోట్లు గణనీయంగా పెరిగాయని ఫిర్యాదులు వస్తుండంటంతో ఆర్బీఐ రూ.200 నోట్లను రద్దు చేస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది.
rs 200 note
Feb 11, 2025 10:00 IST
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే ఇంత పెరిగిందా?
బంగారం ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంటున్నాయి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,469గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
Gold rates 07 Photograph: (Gold rates 07)
Feb 11, 2025 09:21 IST
350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్...గూగుల్ మ్యాప్ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!
మహా కుంభమేళా కి వెళ్లే భక్తుల వాహనాలతో జాతీయ రహదారి పై సుమారు 350 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్ర పుటలకు ఎక్కింది.
kumbhtraffic
Feb 11, 2025 09:19 IST
ఢిల్లీ ఓటమి ఎఫెక్ట్.. పంజాబ్ సీఎంతో కేజ్రీవాల్ భేటీ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ పంజాబ్ మీద కూడా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు .
aravind mann
Feb 11, 2025 09:19 IST
బందీల విడుదలపై హమాస్ కు ట్రంప్ వార్నింగ్
Feb 11, 2025 09:19 IST
అమెరికాలో మరోసారి ఢీకొన్న విమానాలు.. ఒకరు మృతి
అమెరికా అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో మరో విమాన ప్రమాదం జరిగింది. రన్‌వే పై రెండు విమానాలు ఢీకొనడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ జెట్ రన్‌వేపై నుంచి అదుపుతప్పి ఇంకో బిజినెస్ జెట్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
మహా కుంభమేళాకు గత వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువ కాగా.. ఆ ఎఫెక్ట్ హైకోర్టుపై పడింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టులోని కేసులన్నీ పెండింగ్‌లో పడేలా చేసింది. గత రెండు రోజుల నుంచి యూపీలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిన సంగతి తెలిసిందే.
Feb 11, 2025 09:17 IST
రంగరాజన్‌పై దాడి చేసింది వీడే.. రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి వసూళ్ల దందా!
చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు రామరాజ్యం పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. ఫేమస్ కావాలనే ఉద్దేశ్యంతోనే దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు.
veera raghavareddy
Feb 11, 2025 09:16 IST
అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. ప్రధానంగా బ్యాంకింగ్, లోహ, చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని...లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి.
Feb 11, 2025 09:16 IST
గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్ తినవద్దని హెచ్చరికలు జారీ
తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు.
Feb 11, 2025 09:15 IST
హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
సినిమాలో ఆఫర్ ఇప్పిస్తామంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను కొందరు దుండగులు మోసం చేశారు. ఆమె వద్ద నుంచి రూ.4 కోట్లను తీసుకుని వారు ముఖం చాటేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
arushi
Feb 11, 2025 09:14 IST
పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్
Feb 11, 2025 09:11 IST
మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!