Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
ఎప్ట్సీన్ పై ఇచ్చిన నివేదిక నకిలీదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రూపర్ట్ ముర్డోక్ కంపెనీ, దాని యజమానులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు. 10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది.
నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వెంకట్ తుది శ్వాస విడిచారని బంధువులు చెబుతున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో లిక్కిపడే ఘటన జరిగింది. ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు.
బంగ్లాదేశ్ తన గతాన్ని,సాంస్కృతిక చరిత్రను ,భారతదేశంతో తన భాగస్వామ్య వారసత్వాన్ని వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముజీబ్, ఠాగూర్ల ఇళ్ళ తర్వాత ఇప్పుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేత తో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జైలుకు వెళ్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు దానిపై హిమంత స్పందించారు. రాహుల్ కోసం అస్సాం జైళ్ళు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఆయన ప్రసంగాల వలన ఆక్రమణదారులు పోలీసులపై దాడి చేశారని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది. దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. అయితే ఇది సాధారణ వ్యాదేనని..కంగారుపడవలసిన అవసరం లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకటించారు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దంచికొడుతున్నాడు. ప్రస్తుతం 425 రన్స్ తో సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్న పంత్..మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు.