/rtv/media/media_files/2025/10/16/sumanth-2025-10-16-06-09-44.jpg)
హైదరాబాద్ జూబ్లీహిల్స్(jubilee hills) లోని గాయత్రి హిల్స్ లోని మంత్రి కొండా సురేఖ(minister-konda-sureka) ఇంటి దగ్గర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ పై కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేసింది. ఈ నేపథ్యంలో అతను సురేఖ ఇంట్లోనే ఉన్నాడనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇప్పటికే ఫిర్యాదులున్న సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. అయితే పోలీసులు మఫ్టీలో వెళ్ళడంతో...వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. మఫ్టీలో ఎందుకు వచ్చారని...మీరెవరని ప్రశ్నలు అడిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము పోలీసులమని, సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చామని చెప్పగా... ఆమె తాను ఇంట్లోకి అనుమతించనంటూ అడ్డుకున్నారు. ఈ లోపు మంత్రి సురేఖ, సమంత్ లో బయటకు వచ్చి పోలీసుల ఎదురుగానే ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు.
Also Read : ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు దంచుడే దంచుడు!
బిగ్ బ్రేకింగ్ - కాంగ్రెస్ లో దుమారం
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) October 15, 2025
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత
కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
సుమంత్ ..… pic.twitter.com/jTQfGuNwEj
Also Read : మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు!
కాంగ్రెస్ పెద్దలు కావాలనే ఇదంతా చేస్తున్నారు..
కావాలనే తమ తల్లిదండ్రులపై కుట్రపన్నుతున్నారని మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత అంటున్నారు. కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారంటూ ఆరోపించారు. బీసీలకు ప్రాధాన్యమివ్వాలని రాహుల్‌గాంధీ అంటుంటే.. పెద్దలు తమను తొక్కేస్తున్నారని అన్నారు. నిజానికి పోలీసులు సుమంత్ ను అరెస్ట్ చేయడానికి రాలేదని...అతనిని అడ్డుపెట్టుకుని మా అమ్మ సురేఖను అదుపులోకి తీసుకునేందుకు వచ్చారని సుస్మిత మీడియా ఎదుట ఆరోపించారు. తప్పులు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను వదిలేసి తమ మీద పడ్డారని అన్నారు. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని కొండా మురళి చెబితేనే నేను బెదిరించానని ఆయనతో పోలీసులు తెల్లకాగితంపై రాయించి, ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే మా నాన్నకు గన్‌మెన్‌ను తొలగించారు అంటూ సుస్మిత మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ వ్యవహారం వెనుక ఉన్నారని అన్నారు.