Trump On Russia Oil: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు...ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్...ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుని చెప్పారు. 

New Update
Trump

Trump

రష్యా చమురుకు భారత్(india russia oil trade) అతి పెద్ద కొనుగోలుదారు. దీని కారణంగా ఇరు దేశాలూ లాభం పొందుతున్నాయి. అయితే దీనిని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(america president donald trump) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యాతో చమురు వ్యాపారం చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికి సహాయం చేస్తున్నారంటూ భారత్, చైనాలపై ట్రంప్ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కొనుగోలు ఆపాలని భారత్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వినకపోయేసరికి ఇండియాపై 50శాతం అదనపు శాతం సుంకాలను కూడా విధించారు. ఈ విషయమై భారత్, అమెరికాల మధ్య చాలా రోజులుగా వివాదం చెలరేగుతోంది. ఇరుదేశాల మధ్యనా వాణిజ్యం ఆగిపోయింది. అయితే మళ్ళీ ఈ మధ్యనే భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈరోజు కీలక వ్యాఖ్యలను చేశారు. 

Also Read :  48 గంటల కాల్పుల విరమణ తర్వాత కూడా ఘర్షణలు..పదుల్లో మరణాలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదు..

ఇక మీదట రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ తనకు ఈ రకమైన హామీ ఇచ్చారని తెలిపారు ఉక్రెయిన్ తో జరిగే యుద్ధంలో రష్యా ను ఒంటరి చేయడంలో ఇదొక కీలకమైన అడుగని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలను చేశారు. రష్యాతో చమురు వ్యాపారం చేయడంపై మోదీతో మాట్లాడానని..ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భారత్...రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వలన నిధులు అందుతున్నాయని...దీంతోనే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తాము భావిస్తున్నామని ట్రంప్ అన్నారు. 

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తాను చాలా రోజుల నుంచి సంతోషంగా లేనని ట్రంప్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ దగ్గర వ్యక్తం చేశానని చెప్పారు. ఇక మీదట చమురు కొనుగోలు చేయమని చెప్పారని..తనకు హామీ ఇచ్చారని చెప్పారు. చైనాతో కూడా ఇదే పనిని చేయిస్తానని ట్రంప్ చెప్పారు. చమురు కొనుగోలుపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నమాట వాస్తవమేనని...అయినా కూడా యూఎస్ కు ఇండియా ఎప్పటికీ సన్నిహిత భాగస్వామని వ్యాఖ్యలు చేశారు. మోదీతో తనకు గొప్ప స్నేహితుడని...తమ మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై భారత్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.   

Also Read: Konda Surekha: మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా...పోలీసుల ఎదురుగానే ఒకే కారులో వెళ్ళిన సురేఖ, సుమంత్

Advertisment
తాజా కథనాలు