/rtv/media/media_files/2025/10/16/pak-afghan-2025-10-16-08-02-07.jpg)
దాదాపు వారం రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లమధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. పాక్ సైన్యం ఆఫ్ఘానిస్తాన్ పై దాడికి దిగింది. ఇందుకు ప్రతిగా తాలిబన్లు కూడా దాడులు చేస్తున్నారు. సరిహద్దుల్లో ఇరు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో దాదాపు 40మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది.
Also Read : రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు...ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్ పై దాడి చేసిన తాలిబన్లు..
అయితే అంతకు ముందే పాక్, ఆఫ్ఘాన్ దేశాలు 48 గంటల కాల్పుల విరమణకు అంగీకించాయి. తాలిబన్లు కోరితే తాము ఈ ఒప్పందానికి వచ్చామని పాక్..ఆదేశం అడిగితేనే తాము ఒప్పుకున్నామని రెండు దేశాలు చెప్పుకున్నాయి. ఇంతా చేస్తే అది కూడా కేవలం నోటి మాట కిందనే ఉండిపోయింది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్, ఆఫ్గాన్ లు ఘర్షణ పడ్డాయి. బోర్డర్ వెంబడి పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్ తాలిబన్లను హతమార్చామని పాక్ సైన్యం తెలిపింది. బలోచిస్తాన్ ప్రాంతంలో తాలిబ్లు దాడులకు తెగబడ్డారని..సామాన్యుల మీద కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగానే తాము దాడులను నిర్వహించామని చెప్పింది. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో కూడా ఆఫ్ఘాన్లు పోస్టులను ధ్వంసం చేసి దాడులకు పాల్పడ్డారని చెప్పింది.
Pakistan, Afghanistan Agree To 48-Hour Ceasefire After Dozens Killed In Clashes@SehgalRahesha speaks to strategic affairs expert @Chellaneypic.twitter.com/V5XSvbvBgK
— NDTV (@ndtv) October 15, 2025
సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం
అయితే, ఆఫ్ఘన్ వర్గాలు ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు సామాన్య పౌరులు కూడా మరణించినట్లు, ఇది తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆఫ్ఘన్ గడ్డ నుంచి తమ దేశంపై జరుగుతున్న ఉగ్ర దాడులను ఇకపై సహించబోమని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో, రెండు దేశాల సైన్యాలు సరిహద్దుల్లో ఒకరి పోస్టులపై మరొకరు దాడులు చేసుకోవడంతో పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఏర్పడింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతను తగ్గించడానికి సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఈ చర్చల ఫలితంగా, ఇరు పక్షాలు 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించడానికి అంగీకరించాయి. ఈ కాల్పుల విరమణ ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్లు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.
Also Read : భారత్ తరపున ఆఫ్ఘాన్ యుద్ధం..నోరు పారేసుకున్న పాక్ మంత్రి