Stock Market: చాలా రోజుల తర్వాత..లాభాల్లో స్టాక్ మార్కెట్లు

చాలా రోజుల తర్వాత దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరిగి 82,350కి చేరుకుంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 25,250కి చేరుకుంది.

New Update
stock market today

stock market today

లాస్ట్ రెండు రోజులు దేశీయ మార్కెట్లు వరుసగా నష్టాలను చవి చూశాయి. కానీ ఈరోజు మాత్రం ఉదయం ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ మన సూచీలు మాత్రం లాభాలను చవి చూస్తున్నాయి. కనిష్టాల దగ్గర మదుపర్లు కొనుగోళ్ళు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరిగి 82,350కి చేరుకుంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 25,250కి చేరుకుంది.డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.27 గా ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 25 లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్‌టిపిసి, ఎల్ అండ్ టి 1% కంటే ఎక్కువ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఇలో ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ రంగాలు లాభాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లు పతనం..

కానీ ఆసియా, అమెరికా మార్కెట్లు మాత్రం పతనంలో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో, కొరియా కోస్పి 1.83% పెరిగి 3,626 వద్ద, జపాన్ నిక్కీ 1.31% పెరిగి 47,463 వద్ద ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.10% పెరిగి 25,720 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.065% తగ్గి 3,862 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే అక్టోబర్ 14న US డౌ జోన్స్ 0.44% పెరిగి 46,270 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.76%, S&P 500 0.16% పడిపోయాయి. అక్టోబర్ 14న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.1,508.53 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.3,661.13 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు చేశారు.

Also Read: BIG BREAKING: గాజాలో మళ్లీ చెలరేగిన హింస.. పారుతున్న రక్తం.. 50 మంది హతం?

Advertisment
తాజా కథనాలు