Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఇంకా ఆలోచనలోనే ఉందని...తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే ఇచ్చిన 187 పరుగులు లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న సీరియల్ కిల్లర్ దేవేంద్ర శర్మను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇతను మనుషుల్ని కిరాతకంగా చంపేసి యూపీలోని కాస్గంజ్లో మొసళ్లు ఎక్కువ ఉండే హజారా కాల్వలో పడేసేవాడు. ఇతను 50కు పైగా హత్యలను చేశాడు.
పాకిస్తాన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెగ ట్రెండ్ అవుతున్నారు. దాడికి కారణం ఆయన చేసిన ట్వీట్స్ అని తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఆపరేన్ సింధూర్ మీద చేసిన కామెంట్స్ ను అక్కడి మీడియా హైలేట్ చేస్తోంది.
చాలా రోజుల నుంచి పాకిస్తాన్ దారిద్ర్యరేఖకు చేరువలో ఉంది. ఇప్పుడు భారత్ తో యుద్ధం తర్వాత దాని పరిస్థితి మరింత దిగజారిపోయింది. ప్రపంచ సంస్థల నుంచి ఆర్థిక సాయం తగ్గడంతో పాక్ కరువు అంచున ఉంది.
ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం మీద 450 దాకా తగ్గింపు కనిపిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది.
భారత్, పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో రెండు దేశాల బోర్డర్లనూ మూసేశారు. వాఘా-అట్టారీ బోర్డర్ దగ్గర జరిగే బీటింగ్ రిట్రీట్ ను కూడా ఆపేశారు. కానీ ఇప్పుడు 12 రోజుల తర్వాత దానిని తిరిగి ఈరోజు ప్రారంభిస్తున్నారు. గేట్లు తెరవకుండానే జెండాలను ఎగురవేయనున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎట్టకేలకు శాంతి చర్చలకు బీజం పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు గంటలు చర్చలు జరిపిన తర్వాత ఆయన దీన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు తాను కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ ప్రకటించారు.