/rtv/media/media_files/2025/11/12/faridabad-2025-11-12-08-01-19.jpg)
ఢిల్లీతో పాటూ మరి కొన్ని చోట్ల బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడు కంటే ముందే హర్యానాలోని ఫరీదాబాద్ లో నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ ల దగ్గర నుంచి పలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. హరియాణాలోని ఫరీదాబాద్ లో పేలుడికిసబంధించి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పోగుచేశారు. ఇది దాదాపు 3 వేల కేజీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పేలుడు పదార్ధాలతో పాటూ ఎలక్ట్రానిక్ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు.
శ్రీనగర్ లో జేఎం పోస్టర్లు..
నిజానికి వీరు దేశంలో పలు చోట్ల భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు. ఢిల్లీలో కూడా ఇంత కంటే పెద్ద దాడినే ప్లాన్ చేశారు. కానీ ఫరీదాబాద్ లో డాక్టర్లు దొరికిపోవడంతో మొత్తం ఫ్లాప్ అయింది. అక్కడ డాక్టర్లు దొరికిపోయారనే భయంతోనే ఉగ్రవాది ఉమర్ ఢిల్లీలో బాంబ్ పేల్చాడు. అయితే ఇదంతా పోలీసులు ఎలా కనుగొన్నారంటే..గత నెల అక్టోబర్ లో శ్రీనగర్ లోని నౌగామ్ిల్లాలో కొన్ని జేఎంఎం పోస్టర్లు వెలిశాయి. దాని తరువాత కాశ్మీరీ వైద్యులు పాల్గొన్న జైష్-ఎ-మొహమ్మద్ బహుళ-రాష్ట్ర ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలకు మొదటి ఆధారాలు లభించాయని నివేదికలు సూచిస్తున్నాయి. నౌగామ్ లో కనిపించిన జేఎం పోస్టర్లు దళాలపై దాడులు జరుగుతాయి అన్నట్టు ఉంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన ఎస్‌ఎస్‌పి చక్రవర్తి మరియు అతని బృందం, సీసీటీవీఫుటేజ్ సహాయంతో ముగ్గురు భూగర్భ కార్మికులను పట్టుకున్నారు. వీరు గతంలో రాళ్లు రువ్విన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిని విచారిస్తే..షోపియన్‌లోని మతాధికారి మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ దొరికాడు. ఆ మతాధికారిని విచారిస్తే..జమ్మూ కాశ్మీర్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్‌లలో బహుళ-రాష్ట్ర ఉగ్రవాద కుట్రపై ఆధారాలు లభించాయి. దాని ద్వారా జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్, కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు సంబంధించిన "వైట్ కాలర్" టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.
Also Read: Delhi: ఢిల్లీలో దారుణంగా ఎయిర్ పొల్యూషన్..అమల్లోకి కఠిన ఆంక్షలు
Follow Us