/rtv/media/media_files/2025/11/12/shaheen-2025-11-12-07-15-31.jpg)
సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్టర్ దేశం మొత్తాన్ని షాక్ లో పడేసింది. దాని కంటే ముందు ఫరీదాబాద్ లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలతో ముగ్గురు డాక్టర్ల పెడ్లర్లను జమ్మూ-కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ కూడా ఉన్నారు. హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లలో ఈమె కూడా ఒకరు. డాక్టర్ షహీన్ జైషే మహమ్మద్ మహిళా విభాగం భారత్ చీఫ్‌గా పనిచేస్తున్నట్లుగా పోలీసు విచారణలో తెలిసింది. ఆమె ఇండియాలో రహస్యంగా పని చేస్తూ జేషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ విస్తరించేందుకు కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులు జరిపేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్‌తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించినట్లు సమాచారం.
జైషే మహమ్మద్ మహిళా విభాగం చీఫ్..
ఢిల్లీ బాంబు పేలుడు కేసును ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వీరే ఫరీదాబాద్ కేసును కూడా టేకప్ చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో మహిళా డాక్టర్ షహీన్ గురించి చాలా వివరాలు తెలిశాయి. ఈమె కొద్ది రోజుల కిందట వరకూ సాధారణ వైద్యురాలిగా తన పనిలో నిమగ్నమై ఉండేది. ఆమెతో కలిసి పనిచేసిన వారిలో ఎవరికీ షాహిద్ అసలు ఎవరో, ఏమిచేస్తుందో అనే విషయం గానీ, ఆమె గోప్యత ఉన్న ఉద్దేశం గానీ తెలియదు. దానికి కారణం షహీన్ జైషే ఉగ్రవాద సంస్థకు రహప్యంగా పని చేయడమే కారణం. ఢిల్లీలో పేలుడుకు అనుమానితుడిగా భావిస్తోన్న ఉమర్ మహమ్మద్ కూడా వీళ్ళల్లోఒకడని..ఫరీదాబాద్ లో డాక్టర్లు దొరికిపోయారని తెలియగానే భయంతోనే ఆత్మాహుతి బాంబర్‌గా మారినట్టు భావిస్తున్నారు.
తేడా ప్రవర్తన..
షహీన్ పని చేస్తున్న యూనివర్శిటీ ప్రోఫెసర్ ఆమె గురించి మరిన్ని వివరాలను చెప్పారు. షహీన్ అస్సలు క్రమశిక్షణ పాటించేదికాదని..ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెట్టేదని..అది కూడా ఎవరికీ చెప్పకుండా అని తెలిపారు. కాలేజీలో ఆమెను కలవడానికి చాలా మంది వచ్చేవారు.. ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉండేది..ఆమెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయని చెప్పారు. షహీన్ అరెస్ట్ అయ్యాకనే ఆమె గురించి పూర్తిగా తెలిసిందని అన్నారు. ఉగ్రవాద ఆరోపణల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థకు తాము పూర్తిగా సహకరిస్తామని ప్రొఫెసర్ స్పష్టం చేశారు. మసూద్అజార్ సోదరి సాదియాఅజార్ నేతృత్వం వహిస్తోన్న జైషే మహమ్మద్ మహిళా విభాగం జమాత్ ఉల్ మొమినాత్‌కు భారత్‌లో చీఫ్‌గా షహీన్ షాహిద్ బాధ్యతలు చేపట్టినట్టు గుర్తించారు. అల్ పలాహ్ యూనివర్సిటీలోని కశ్మీరీ వైద్యుడు ముజామిల్ గనై అలియాస్ ముసైబ్‌తో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఫరీదాబాద్ మాడ్యూల్‌లో తన సోదరుడు పర్వేజ్ సయీద్ కూడా భాగమని షహీన్ తెలిపింది. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి నుంచి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. అరెస్టు అవుతాననే అనుమానంతో వాటిని దాచి ఉంచొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గురుగ్రామ్‌కు చెందిన అమ్మోనియం నైట్రేట్ సరఫరాదారుడిని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దాడులు చేసి అతడిని కూడా అరెస్టు చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
Follow Us