Trump: భారత్ తో అద్భుతమైన సంబంధాలున్నాయ్..త్వరలోనే వాణిజ్య ఒప్పందం ట్రంప్ సూచన

భారత కొత్త అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా భారత్ తో తమకు అద్భుతమైన సంబంధాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పారు.

New Update
trump trade deal

అమెరికా, భారత్ ల మధ్య త్వరలోనే పెద్ద వాణిజ్య ఒప్పందం జరగనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన ప్రాయంగా తెలిపారు. ఈ రోజు భారత కొత్త అమెరికా రాయబారి సెర్గియోగోర్ ప్రమాణ స్వీకారంలో...అధ్యక్షుడు భారత ప్రధాని మోదీతో తనకు అద్భుత సంబంధాలున్నాయని మరోసారి నొక్కి చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా భాగస్వామి అన్నారు. ఈ క్రమంలో ఇండియాతో కొత్త వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు అమెరికా చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. అలాగే ఆ దేశంపై సుంకాలను తగ్గించాలనే యోచనలో కూడా ఉన్నామని సంకేతాలిచ్చారు.

బంధం మరింత బలోపేతం..

భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధం "చాలా ముఖ్యమైనది" అని అభివర్ణించిన ట్రంప్..కొత్త రాయబారి సెర్గియోగోర్ భారతదేశంలో "గొప్ప విజయం" సాధించబోతున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో సెర్గియో కీలకపాత్ర వహిస్తారని ట్రంప్ తెలిపారు. అలాగే కీలకమైన US పరిశ్రమలు, సాంకేతికతలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అమెరికన్ ఇంధన ఎగుమతులను పెంచడానికి, మా భద్రతా సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తారని అన్నారు. అమెరికా న్యాయమైన ఒప్పందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నామని...గతంలో ఉన్న ఒప్పందం కంటే చాలా భిన్నమైన ఒప్పందమని చెప్పారు.

వచ్చే ఏడాది వస్తా..

అంతకు ముందు నాలుగు రోజుల క్రితం కూడా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ తో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని చెప్పారు. భారత ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అని మరోసారి ఉద్ఘాటించారు. మేము మాట్లాడుకుంటుంటాము. నా మాట విని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం తగ్గించారు. ప్రధాని మోదీ చాలా గొప్ప వ్యక్తి.. నన్ను వారి దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది అక్కడకు కచ్చితంగా వెళ్తానుఅనిట్రంప్ చెప్పారు. అయితే ఎప్పుడు వస్తారు అనేది మాత్రం వివరాలు చెప్పలేదు. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నందున భారతదేశాన్ని సందర్శించే ప్రణాళికలను ధృవీకరించారు. రెండు వైపులా ట్రేడ్ డీల్ లోని మొదటి దశను ఖరారు చేయాలని ప్రయత్నిస్తున్నామని ట్రంప్ చెప్పారు.

Also Read: BIG BREAKING: ఢిల్లీ కారు బాంబు అనుమానితుడు గుర్తింపు..ఫోటో విడుదల

Advertisment
తాజా కథనాలు