/rtv/media/media_files/2025/11/12/bengaluru-rcb-2025-11-12-09-20-32.jpg)
Bengaluru, RCB
17 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారిఆర్సీబీఐపీఎల్ కప్ ను గెలుచుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. టోర్నీ గెలిచాకఆర్సీబీ బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. బెంగళూరులో జరిగిన ఆర్సీబీ పరేడ్ విషాదంగా ముగిసింది. చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. 52 మందికి గాయాలయ్యాయి. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు రావడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇదంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగింది.
చిన్నస్వామి స్టేడియంపై నిషేధం..
దీని ఎఫెక్ట్ వచ్చే ఏడాది అంటే 2026 ఐపీఎల్ మీద కూడా పడనుందని తెలుస్తోంది. రాబోయే ఎడిషన్ ఫ్రాంచైజ్ లీగ్‌లో ఎటువంటి మ్యాచ్‌లను ఐకానిక్ వేదికలో నిర్వహించకూడదనే చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఆర్సీబీ తన హోయ్ మ్యాచ్ లన్నింటినీపుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడాల్సి ఉంటుందని చెబుతున్నారు. తొక్కిసలాట తర్వాత ఎం చిన్నస్వామి స్టేడియం ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హంగా ప్రకటించబడింది. దీని కారణంగానే మ్యాచ్ లను కూడా వేరే స్టేడియానికి తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ...దానిని ఇంకా నిర్ధారించలేదని తెలుస్తోంది. దీనిలో కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని MCA కార్యదర్శి కమలేష్పాయ్ చెబుతున్నారు.
ఆర్సీబీనే మొదటి జట్టు..
మరోవైపుఆర్సీబీ కానీ మరే ఇతర జట్లు కానీ తమ హోమ్ మ్యాచ్ లను వేరే గ్రౌండ్లలో ఆడిన దాకలు లేవు. ఇప్పుడు ఆర్సీబీ కనుక పుణె గ్రౌండ్ లో ఆడితే..ఈ జట్టే మొదటిసారి తమ హోమ్ గ్రౌండ్ లో కాక వేరే వేదిక మీద ఆడే మొదటి జట్టుగా నిలుస్తుంది. 2009లో కూడా ఆర్సీబీ తన మ్యాచ్ లను బెంగళూరులో ఆడలేదు. అయితే అప్పుడు మొత్తం టోర్నమెంట్ ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అలాగే కోవిడ్ టైమ్ లో కూడా. అందుకే ఇవి లెక్కలోకి రావని చెబుతున్నారు.
Also Read: Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడులో మరో కొత్త కోణం..ఐఈడీని అమర్చక ముందే పేలుడు
Follow Us