Pakistan: ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాక్ ఆర్మీ..పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆరోపణ

ఢిల్లీ, ఇస్లామాబాద్ కారు బాంబ్ బ్లాస్ట్ ల వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందని ఆ దేశ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ చెబుతున్నారు. రెండు సిటీల్లోనూ ఆత్మాహుతి బాంబర్లను ఆర్మీనే నియమించదని ఆరోపించారు.

New Update
pak army

పాకిస్తాన్ ఆర్మీకి, ఉగ్రవాద సంస్థలకు కనెక్షన్లు ఉన్నాయని చెబుతున్నారు ఆ దేశ జర్నలిస్ట్ తాహా సిద్దిఖీ. తాజాగా జరిగిన ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబు బ్లాస్టర్ల వెనుక కూడా ఆర్మీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఇస్లామిక్ టెర్రరిజాన్ని...పార్ ఆర్మీ ఉపయోగించడంమానేసేంత వరకు దక్షిణ ఆసియా ప్రశాంతంగా ఉందని అంటున్నారు. దీన్నొక ఆయుధంగా ఆర్మీ ఉపయోగించుకుంటోందని..దాని ద్వారా మిగతా దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోందని సిద్దిఖీ ఆరోపిస్తున్నారు.

టెర్రర్ గ్రూపులతో చేతులు కలిపిన ఆర్మీ..

తన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ అల్లకల్లోలం సృష్టించి దాని ద్వారా నెగ్గుకు రావాలని పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం చూస్తోందని తాహా సిద్ధిఖీ ఆరోపించారు.  టెర్రరిస్టు గ్రూపుల వెనుక పాక్ ఆర్మీ ఉంది కాబట్టే...అవి వరుస దాడులకు పాల్పడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆర్మీ ఇచ్చిన ధైర్యంతోనే అవి రెచ్చిపోతున్నాయని సిద్దిఖీ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ లో పోస్ట్ రాశారు. అల్ ఖైదా టెర్రరిస్ట్ మాట్లాడుతున్న వీడియోను కూడా తాహా సిద్ధిఖీ పోస్ట్ చేశారు. ఈ వీడియో ఒక్కటి చాలు పాకిస్తాన్ ఆర్మీకి, టెర్రర్ గ్రూప్ లతో సంబంధం ఉందని చెప్పడానికి అంటూ అందులో రాశారు. 

Advertisment
తాజా కథనాలు