Delhi: ఢిల్లీలో దారుణంగా ఎయిర్ పొల్యూషన్..అమల్లోకి కఠిన ఆంక్షలు

ఢిల్లీ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ కోరల్లో చిక్కుకుపోయింది. అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో దేశ రాజధానిలో మళ్ళీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 20వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

New Update
AIR Pollution in delhi

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ గాలి నాణ్యత క్షీణించింది. ఇది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కఠిన నిబంధనలు అమలు చేయాలని ‘ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌’ నిర్ణయించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-3 ఆంక్షలు విధించింది. స్థానికంగా వాయు నాణ్యత సూచి సోమవారం 362గా ఉండగా.. మంగళవారం ఉదయం 7 గంటలకు 425కి పెరిగింది. దాంతో పాటూ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ విధానంలో విద్యార్థులకు పాఠాలను బోధించాలని ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను ఆదేశించింది.

ఈ సీజన్‌కు ఇదే అత్యధికం..

ఈ ఏడాది...ఈ సీజన్ లో ఢిల్లీలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయి అని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. దీంతో సిటీలో చాలా కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 20వేలు వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పింది. ఆంక్షల ప్రకారం 2020 ఏప్రిల్ నెలకు ముందు అమ్ముడైన అన్ని కార్లు BS-IV కేటగిరీలోకి వస్తాయి. కాగా BS-III నిబంధనలు 2010 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో బీఎస్6 వాహనాలు వినియోగంలో ఉన్నాయి. ఈ వాహనాలతో పోలిస్తే.. బీఎస్4, బీఎస్3 వాహనాలు అధిక కాలుష్య కారకాలను విడుదల చేస్తాయి. ఈ కారణంగానే ఢిల్లీలో ఈ వాహనాల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించారు.

Also Read: Delhi Blast: ఫరీదాబాద్ లో పట్టుబడ్డ మహిళా డాక్టర్ ఎవరు? ఉగ్రవాదంలోకి ఎలా వచ్చింది?

Advertisment
తాజా కథనాలు