/rtv/media/media_files/2025/11/12/delhi-blast-2025-11-12-08-28-50.jpg)
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని...కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హడావుడిగా చేశారు..
ఎర్రకోట సమీపంలో పేలిన కారు బాంబులో ఐఈడీని సరిగ్గా అమర్చలేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అందుకే పేలుడు స్థలంలో పగుళ్లు లేకపోవడం, ఇనుప లేదా వైర్ ముక్కలు లభించకపోవడం జరిగిందని అంటున్నారు. ఈ పేలుడులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో పాటు అరెస్ట్ అయిన ఇతర అనుమానితులు కూడా డాక్టర్లే కావడం.. తమ ఉగ్ర కార్యకలాపాలను దాచేందుకు డాక్టర్ వృత్తిని ఒక ముసుగుగా వాడుకున్నారని విచారణలో తేలింది. అయితే ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ కు, ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధాలున్నాయని తేలింది. అక్కడ డాక్టర్లు అరెస్ట్ కాగాను ఉమర్ భయపడ్డాడని..ఫరీదాబాద్ నుంచి పారిపోయాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలనుకున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఐఈడీని సక్రమంగా అరేంజ్ చేయలేదని..అందుకేబ్లాస్ట్ ఎఫెక్ట్ తక్కువగా ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన హ్యూందాయ్ ఐ20 కారు.. రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్‌లో మెల్లగా కదులుతోందని.. కారు కదలికలోనే ఐఈడీఏదైనా టెక్నికల్ లోపంతో పేలి ఉండవచ్చనే కోణాన్ని కూడా నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి.
పక్కా ఉగ్రదాడి..
ఏది ఏమైనప్పటికీ ఇది పక్కా ఉగ్రదాడేనని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని...దీనిలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాంబును హడావుడిగా రెడీ చేసి.. తరలిస్తుండగా.. అది పేలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కారులో ఉన్నవి.. అమ్మోనియం నైట్రేట్, ఇతర ఇంధనం, డిటోనేటర్లు అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. చనిపోయిన వారిలో వారిలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరి వివరాలను మాత్రమే గుర్తించగలిగారు. వీరిలో ఒకరిది ఉత్తరప్రదేశ్ కాగా.. మరొకరు ఢిల్లీకి చెందిన వారు. ఇక మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us