/rtv/media/media_files/2025/11/12/bomb-2025-11-12-10-59-45.jpg)
ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. మరి కొంత మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరిని మాత్రమే ఇప్పటి వరకు గుర్తు పట్టగలిగారు. వీరిలో అమర్ కటారియా ఒకరు. బాంబు దాడిలో చనిపోయిన వారి శరీరాలు ఛిద్రమై పోయాయి. శరీర భాగాలు విడిపోయి పడి ఉన్నాయి. దీంతో మృతులను గుర్తు పట్టడం కష్టంగా మారింది. కానీ మృతుల్లో ఒకరైన కటారియా చేతి మీద ఉన్న టాటూనే ఆయన్ను గుర్తు పట్టగలిగేలా చేసింది.
చేతి మీద టాటూతోనే గుర్తుపట్టాం..
అమ్మ నా మొదటి ప్రేమ, నాన్న నా బలం..అని రాసి ఉన్న టాటూనే అమర్ కటారియాను గుర్తు పట్టగలిగేలా చేసింది అమర్ వయసు 34 ఏళ్ళు. ఈయన చాందినీ చౌక్ లో ప్రముఖ ఫార్మా వ్యాపారి. అమర్ కటారియాభగీరథ్ప్యాలెస్‌లోఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపేవారు. సోమవారం ఆయన తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేసేందుకు సాయంత్రం 6.45 గంటలకు షాప్ నుంచి ఇంటికి బయలుదేరారు. కానీ దారి మధ్యలో బాంబు పేలి అనంత లోకాలకు వెళ్ళిపోయారు. అమర్ కు భార్య , మూడేళ్ల కొడుకు ఉన్నారు. అమర్ కుటుంబం అతని చేతిలో ఉన్న పచ్చబొట్టు, ఉంగరం ఉన్న గొలుసు మరియు చెవిపోగు ద్వారా అతన్ని గుర్తించింది. అమర్ తలపై మాత్రమే గాయం ఉందని..శరీరం బాగానే ఉందని ఆయన తండ్రి తెలిపారు. సాయంత్రం ఇంటికి రావడానికి అమర్ టాక్సీ కోస్వేచిచూస్తుండవచ్చని..ఆ సమయంలోనే బాంబు బ్లాస్ట్ జరిగిందని అమర్ తండ్రి చెప్పారు. మేము ఫోన్ కాల్ చేయగా..ఒక మహిళ ఆన్సర్ చేసి బ్లాస్ట్ గురించి చెప్పారని తెలిపారు.
#WATCH | Delhi | Father of one of the deceased, Amar Kataria, who lost his life in Red Fort Car blast, Jagdish Kataria says, "... We don't yet know if it was a terror attack. He had a shop in Bhagirath Palace and had left at around 6:45 PM. He might have been waiting for a… pic.twitter.com/fuPbg5Cdqp
— ANI (@ANI) November 12, 2025
Follow Us