BREAKING: లెంజడరీ నిర్మాత కన్నుమూత
ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతూనే శరవణన్ తుది శ్వాస విడిచారు.
ఏవీఏం స్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతూనే శరవణన్ తుది శ్వాస విడిచారు.
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల రూల్స్ విచిత్రంగా దారుణంగా ఉంటాయి. అక్కడ మరణశిక్షలు విధిస్తే..ప్రజల ఎదురుగానే దాన్ని అమలు చేస్తారు. తాజాగా ఓ నిందితుడిని 80 వేల మంది ఎదురుగా 13 ఏళ్ళ బాలుడు కాల్చి చంపి మరీ మరణశిక్ష అమలు చేశాడు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ ఇండియాలో పర్యటించనున్నారు. రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సీరీస్ లో రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారీ లక్ష్యాన్నిచ్చినా సఫారీలు దాన్ని ఛేదించేశారు. దీనికి కారణం భారత ఆటగాళ్ళ చెత్త ఫీల్డింగే అంటున్నారు. బౌలర్లు సైతం ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు.
బయట ప్రపంచానికి నీతులు చెప్పే పాకిస్తాన్ తన దేశంలో మహిళలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని నివేదికలు చెబుతున్నాయి.
భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.
రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. దీని కంటే ముందు రష్యా కీలక ఒప్పందంపై ఆమోదం తెలిపింది. సైనిక కార్యకలాపాలు, విన్యాసాలు, విపత్తు సహాయానికి పరస్పర లాజిస్టికల్ మద్దతును కల్పించే కీలకమైన సైనిక ఒప్పందానికి అంగీకరించింది.
శ్రీలంకకు సహాయం అందిస్తున్న తమ దేశ విమానానికి ఇండియా ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందని పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అబద్ధాలు చెప్పే పాక్ బుద్ధి ఎప్పటికీ మారదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.