/rtv/media/media_files/2025/12/03/pak-women-2025-12-03-10-56-13.jpg)
భారత్(india) లో ఏం జరిగినా తెగ రెచ్చిపోతుంది. పాకిస్తాన్(pakistan). వాళ్ళ దేశమే తోపుఅన్నట్టు మాట్లాడుతుంది. మాట్లాడితే చాలు మీ దేశం లో అలా అంటూ ప్రపంచ వేదికల మీద ఉపన్యాసాలు దంచికొడుతుంది. తీరా చూస్తే వారి దేశమే అన్ని రకాలుగా పెద్ద డొల్ల. ప్రపంచంలో చాలా దేశాల కంటే పాకిస్తాన్ అన్ని రకాలుగా అట్టడుగున ఉంది. ఆర్థికంగా, నేరాల పరంగా, ఉగ్రవాదంతో ఎప్పుడూ సతమతమవుతూనే ఉంటుంది. దానికి తోడు అంతర్గత ఘర్షణలతో పాకిస్తాన్ తనను దెబ్బ తీసుకుంటోంది. ఇవన్నీ చాలవన్నట్టు దాయాది దేశంలో మహిళల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని తెలుస్తోంది. అక్కడి స్త్రీలు నానా పాట్లు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. వారిపై జరిగే నేరాలకు అంతే లేదని పాకిస్తాన్ మీడియానే చాటి చెబుతోంది.
Also Read : దక్షిణ సూడాన్‌లో విమానం హైజాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
విపరీతంగా పెరిగిన నేరాలు..
పాకిస్తాన్ లో మహిళ(women)లపై ఆకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారి పట్ల హింసకు అంతే లేకుండా పోయింది. అక్కడ అత్యాచారం జరిగినా శిక్షలు పడవు. కొట్టినా, తిట్టినా పట్టించుకునే నాథుడే ఉండడు. అసలు మహిళలను మనుషులుగా కింద కూడా చూడడం లేదని స్థానిక మీడియా నివేదికను ప్రచురించింది. ఇస్లామాబాద్ నేషనల్ టెరిటరీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్బాల్టిస్తాన్ (PoGB) అనే ప్రావిన్సులలోని 81 వార్తాపత్రికలలో మహిళపై నేరాల నివేదిస్తూ ప్రచురించబడింది. పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నుండి డేటాను సంకలనం చేసింది. ఈ నివేదిక ప్రకారం..2025లో పాకిస్తాన్‌లో మహిళలపై జరిగిన ఆకృత్యాలకు సంబంధించి 6,543 సంఘటనలు నమోదయ్యాయి. 2024లో 5,253 సంఘటనలు నమోదవ్వగా..ఈ ఏడాది అవి మరో వెయ్యికి పైగా పెరిగాయి. ఇది ఒకే సంవత్సరంలో దాదాపు 25 శాతం పెరుగుదలను సూచిస్తుంది.
2025 జనవరి నుంచి నవంబర్ మధ్య నమోదైన నేరాలలో 1,414 హత్య కేసులు, 1,144 కిడ్నాప్ కేసులు, 1,060 దాడి కేసులు, 649 ఆత్మహత్య కేసులు, 585 అత్యాచార కేసులు ఉన్నాయి. 32 శాతం అత్యాచార కేసుల్లో, నేరస్థులు మహిళలకు తెలిసినవారేనని, 17 శాతం అపరిచితులు అని, 12 శాతం భర్త ప్రమేయం ఉందని నివేదిక వెల్లడించింది. వీటిల్లో 21 శాతం కేసుల్లో నేరస్థుల గుర్తింపును బయటకు రాకుండా చేశారు. దాంతో పాటూ మహిళలపై హింస చాలా మట్టుకు బాధితుల ఇళ్లలోనే జరిగింది. ఇది నమోదైన కేసుల్లో 60 శాతం కాగా, 13 శాతం నేరస్థుల ఇళ్లలో జరిగాయి. ఇక నవంబర్ ప్రారంభంలో పాకిస్తాన్ రాజధానిలో మహిళలపై హింసపై సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) తన ఫ్యాక్ట్‌షీట్‌ను సమర్పించింది. అందులో 2025 మొదటి అర్ధభాగంలో మహిళలపై 373 హింస కేసులు నమోదయ్యాయని తెలిపింది. వీటిల్లో ఏ ఒక్కదానికీ శిక్ష పడలేదని చెప్పింది.
Also Read : పుతిన్ పర్యటనకు ముందు కీలక ఒప్పందాన్ని ఆమోదించిన రష్యా
అత్యాచారం, కిడ్నాప్ చేసినా శిక్ష ఉండదు..
మహిళలపై అత్యాచారం, హింస అనేది అన్ని దేశాల్లోనూ ఉంది నిజానికి. కానీ వీటి పట్ల అంతే దారుణంగా శిక్షలను కూడా అమలు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ లో మాత్రం మహిళల పట్ల చేసే నేరాలకు శిక్షే లేదు. ఎంచక్కా ఎవరికి నచ్చింది వారు చేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు. మహిళలకు ఏమైనా పట్టించుకునే నాథుడే ఉండడు. ఈ ఏడాదిలో పాకిస్తాన్ లో 309 అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం కేసుల్లో దాదాపు 83 శాతం ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క దానికీ కూడా దోషులను నిర్థారించలేదు. పైగా చాలా మంది ఏం చేయలేక తమ కేసులను ఉపసంహరించుకున్నారు కూడా. శారీరక దాడులు, పరువు హత్యలు కూడా జరిగాయి. అయినా కానీ ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. దోషులకు శిక్షలూ పడలేదు.
పాకిస్తాన్ లో ఆర్మీ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. మొత్తం ప్రభుత్వ పాలనలోనే జోక్యం చేసుకుంటుంది. అక్కడి పోలీసు వ్యవస్థ కూడా దాని కిందనే పని చేస్తుంది. కానీ అదంతా పక్క దేశాల మీద యుద్ధాలు చేయడానికి, తమ గొప్పలు చూపించుకోవడానికి మాత్రమే అనిస్థానికి మీడియా మండిపడుతోంది. దేశంలో మహిళల పట్ల ఇంత దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదంతా అధికారుల వైఫల్యమేనని ఆరోపించింది.
Follow Us