/rtv/media/media_files/2025/07/17/ranadheer-2025-07-17-22-27-36.jpg)
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్
దిత్వా తుఫాను(Cyclone Ditwah) ధాటికి శ్రీలంక(srilanka) అతలాకుతలం అయింది. ఈ క్రమంలో భారత్ తో సహా పలు దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి. పాకిస్తాన్(pakistan) కూడా ఇందులో ఉంది. అయితే శ్రీలంకకు పాక్ విమానాలు వెళ్ళాలంటే భారత్ గగనతలం మీదుగా పోవాలి. పహల్గాం అటాక్ తర్వాత ఇరు దేశాలు ఎయిర్ స్పేస్ ను మూసేసుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంకకు మానవతా సహాయం అందించడానికి తమ విమానాలను అనుమతించాలని పాక్..భారత్ ను అడిగింది. దీనికి భారత్ కూడా ఒకే చెప్పింది. గగనతలాన్ని తెరిచింది కూడా. అయితే ఏ చిన్న అవకాశం వచ్చినా భారత్ మీద విరుచుకుపడాలనే చూస్తుంది పాకిస్తాన్. ఎప్పుడూ మన మీద నేరాలు చెబుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. శ్రీలంకకు మానవతా సాయం అందించేందుకు వెళ్లే తమ దేశ విమానానికి ఇండియా అనుమతి నిరాకరించిందని పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలు చేసింది. 60 గంటల పాటు విమానానికి గగనతల అనుమతి ఇవ్వకుండా భారత్ అడ్డుకుందని పచ్చి అబద్ధాలు ఆడింది.
Also Read : 10 మంది చిన్నారుల ప్రాణం తీసిన COVID-19 వ్యాక్సిన్.. షాకింగ్ నిజాలు!
అన్నీ తప్పుడు ఆరోపణలే..
పాకిస్తాన్ ఆరోపణలపై భారత్ మండిపడింది. భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఆ దేశం ఎప్పుడూ ముందుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన హాస్యాస్పదమైన ప్రకటనను మేము తిరస్కరించాము. ఇది భారతదేశ వ్యతిరేక తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి మరొక ప్రయత్నం అని ఆయన అన్నారు. పాకిస్తాన్ నుంచి ఓవర్‌ఫ్లైట్క్లియరెన్స్ అభ్యర్థన సోమవారం అంటే డిసెంబర్ 1.. మధ్యాహ్నం 1 గంటలకు రాగా.. భారత ప్రభుత్వం అదే రోజు అనుమతి ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక ప్రజలకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఎక్స్పైరీ వస్తువులు..
పోనీ ఇంతా గొడవ చేసిన పాకిస్తాన్...శ్రీలంకకైనా మానవతా సహాయం సవ్యంగా అందించిందా అంటే అదీ లేదు. సైక్లోన్ దిత్వా బాధితులకు సహాయం అందించే ఉద్దేశంతో పంపిన ఆహార ప్యాకెట్లు, ఇతర నిత్యావసరాల్లో అన్ని ఎక్స్‌పైరీ డేట్ ఇప్పటికే దాటిపోయినట్లు శ్రీలంక అధికారులు గుర్తించారు. ఈ విషయంపై శ్రీలంక విపత్తు నిర్వహణ, విదేశాంగ శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
Also Read: India Vs South Africa: సీరీస్ ను దక్కించుకుంటారా? సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే ఈరోజు
Follow Us