India Vs South Africa: సీరీస్ ను దక్కించుకుంటారా? సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే ఈరోజు

సౌత్ ఆఫ్రికాతో టీమ్ ఇండియా ఈ రోజు రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన ఉత్సాహంలో రెండోది కూడా గెలిచి..సీరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది టీమ్ ఇండియా. మరోవైపు సఫారీలు కూడా రెండో మ్యాచ్ గెలిచి పాయింట్లను సమం చేసుకోవాలని చూస్తోంది.

New Update
2nd odi

సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లలోనిరాశపర్చినా...వన్డే సీరీస్(oneday-series) లో మాత్రం టీమ్ ఇండియా దంచి కొడుతోంది. మొదటి వన్డేలో సీనియర్లు చితక్కొట్టారు. రోహిత్ హాఫ్ సెంచరీ, కోహ్లీ 120 పరుగులు, కెప్టెన్ రాహుల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే టీమ్ ఇండియా బ్రహ్మాండంగా ఆడింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆఖర్లో ఉత్కంఠ తప్పలేదు. మ్యాచ్ కష్టం మీద గెలిచింది. తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్‌ను పీకల మీదికి తెచ్చుకుంది. ఇప్పుడు రెండో వన్డే కూడా అలాగే ఆడితే కష్టమే. సీరీస్ ను దక్కించుకోవాలంటే మొదటి మ్యాచ్ కన్నా భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తొలి వన్డేలో సత్తా చాటిన సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు బౌలర్లు తప్పనిసరిగా రాణించాల్సిన అవసరం కూడా ఉంది.

Also Read :  సీరీస్ ను దక్కించుకుంటారా? సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే ఈరోజు

బౌలర్లకు అనుకూలించే పిచ్..

మొదటి వన్డేలో మెరుపులు మెరిపించిన రో-కోల నుంచి మరోసారి అదే స్థాయి పెర్ఫామన్స్ ను ఆశిస్తున్నారు అభిమానులు. ఈరోజు మ్యాచ్ రాయపూర్ లో జరుగుతోంది. రోహిత్ శర్మకు గతంలో ఇక్కడ మంచి రికార్డే ఉంది. ఇక్కడ జరిగిన ఏకైక వన్డేలో రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్‌ 108 పరుగులకే కుప్పకూల్చింది. ఆ విజయంలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. ఎందుకంటే రాయ్ పూర్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కూడా బుమ్రా, సిరాజ్‌ లేక అనుభవం తగ్గిన పేస్‌ దళం.. బౌలింగ్‌కు అనుకూలించే రాయ్‌పుర్‌లో అయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలగాలి. అర్ష్‌దీప్‌ సింగ్, హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ్‌ కృష్ణలతో కూడిన పేస్‌ త్రయం ఈ మ్యాచ్‌లో ఎలా బౌలింగ్‌ చేస్తుందో చూడాలి. 4 వికెట్లతో ఆకట్టుకున్న స్పిన్నర్‌ కుల్‌దీప్‌పై మంచి అంచనాలున్నాయి. అయితే బ్యాటర్లు మాత్రం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మొదటి వన్డేలో భారీ పరుగులు రాబట్టినట్టు ఈరోజు చేయలేకపోవచ్చును.

మ్యాచ్ గెలిచి సమం అవ్వాలని..

ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే..మొదటి వన్డేలో ఓడిపోయిన సఫారీలు రెండో వన్డేలో గెలిచి భారత్ తో సమంగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో బవుమా టీమ్ లో రెండు మార్పులు జరగనున్నాయి అని తెలుస్తోంది. తొలి వన్డేకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ బవుమా, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌.. ఈ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. బవుమా కోసం వికెట్‌ కీపర్‌ బ్యాటర్లుర్యాన్రికిల్‌టన్, క్వింటన్డికాక్‌లలో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక మొదటి వన్డేలో భారత బ్యాటర్ల ధాటికి కుదేలైనసుబ్రయెన్‌ స్థానంలోకి కేశవ్‌ మహరాజ్‌ వస్తాడు. బౌలింగ్‌లో యాన్సెన్, బర్గర్, కేశవ్‌లపై దక్షిణాఫ్రికా ఆశలు పెట్టుకుంది. మొదటి వన్డేలో ఓడినప్పటికీ ప్రొటీస్ టీమ్ చాలా బాగా ఆడింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో రెండో మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది.

Also Read: TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ

Advertisment
తాజా కథనాలు