/rtv/media/media_files/2025/10/20/trump-2025-10-20-14-41-21.jpg)
Trump
ఈ నేపథ్యంలో వెనెజులా మాదక ద్రవ్యాలు, ఆ దేశ పడవల దాడి గురించి మాట్లడుతూ త్వరలోనే వెనెజులాపై దాడి చేస్తామని ట్రంప్ చెప్పారు. వెనెజులా పడవలపై అమెరికా భద్రతా దళాలు సెప్టెంబర్ 2న దాడి చేశాయి. కరేబియన్ సముద్రంలో జరిగిన ఈ దాడి గురించి ట్రంప్ చెబుతూ.. దానికి సంబంధించిన వీడియో ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. అది కచ్చితంగా మాదక ద్రవ్యాలను మోసుకొస్తున్న పడవే అని అన్నారు. ఈ సైనిక దాడుల్లో మొత్తం 83 మందికి పైగా మరణించారు. తమ ప్రభుత్వం దాడి తాలూకా ఫుటేజిని విడుదల చేస్తుందని..అందులో ఎటువంటి సమస్యా లేదని చెప్పుకొచ్చారు. అమెరికా సైనిక దాడి వలన 25 వేల మంది ప్రజలను కాపాడగలిగామని..సముద్రం ద్వారా వచ్చే 91 శాతం మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రాకుండా నిరోధించామని చెప్పుకొచ్చారు. ఇది తాము మాదక ద్రవ్యాల చేస్తున్న యుద్ధమని.. దీన్ని త్వరలోనే తాము భూమి పైకి కూడా విస్తరిస్తామని ట్రంప్ చెప్పారు. వెనెజులాపై దాడికి అమెరికా సిద్ధంగా ఉన్నాదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ హిట్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని బట్టి అతి త్వరలోనే వారు వెనెజులాపై యుద్ధానికి వెళతారని అంటున్నారు.
TRUMP: "Every boat we knock out, we save 25,000 American lives. If you look at our numbers, the drugs coming in through sea are down 91%."
— Breaking911 (@Breaking911) December 3, 2025
"We're going to start very soon on land. I'm sure you're thrilled to hear that." pic.twitter.com/Pcq8fZEp9u
గగనతలమూ మూసివేత..
వెనిజులా(venezula) అమెరికా(usa)ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా వెనిజులాకు సంబంధించిన వైమానికి ప్రాంతాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వెనిజులా మీదుగా చుట్టుపక్కల ఉన్న వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసినట్లుగా పరిగణించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అన్ని విమానయాన సంస్థలు, పైలెట్లు, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాదారులును అడ్డుకోవాలని...దాని కోసమే వెనిజులా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మూసివేయాలని చెప్పారు.
సముద్రంలో అమెరికా దళాలు..
వెనిజులాపై అమెరికా అధ్యక్షుడు ఎప్పటి నుంచో దాడులు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కరేబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించింది అమెరికా. ఈ క్రమంలో వెనిజులా నౌకలపై 20కి పైగా దాడులు నిర్వహించింది. ఇందులో 80మందికి పైగా మరణించారని తెలుస్తోంది. భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం చుట్టూ ఇవి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాను ఆక్రమించుకోవచ్చని చెబుతున్నాయి. మాదక ద్రవ్యాల ముఠాల కోసమే ఇదంతా అని అమెరికా చెబుతోంది. దీనికోసం మొత్తం ఎనిమిది వార్ షిప్ లను పంపించింది. ది ఇవో జిమా యాంఫిబియస్ రెడీగ్రూప్లోనియూఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యూఎస్‌ఎస్ ఇవో జిమా, యూఎస్‌ఎస్ ఫోర్ట్ లాడర్‌డేల్ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. వీటిల్లో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది ఉన్నారు. ఇవి కాకుండా ఏవీ-8బీ హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైనయూఎస్‌ఎస్ జాన్సన్ డున్హమ్, యూఎస్‌ఎస్ గ్రేవ్లీలను కూడా సముద్రంలో ఉంచారు. యూఎస్ఎస్శాంప్సన్ కూడా తూర్పు పసిఫిక్ లోకి వచ్చి చేరుతుందని అమెరికా చెబుతోంది.
Follow Us