/rtv/media/media_files/2025/10/03/modi-putin-2025-10-03-06-36-43.jpg)
రెండు రోజుల పాటూ రష్యా(russia) అధ్యక్షుడు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే రష్యా ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకుంటే అక్కడ భవన నిర్మాణం, జౌళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిపుణుల కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులకు, నిపుణులకు రష్యాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రష్యా చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. ఇలాంటి తరుణంలో పుతిన్‌కు భారత్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read : పాకిస్థాన్ కు గూఢచర్యం.. పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !
కీలక ఒప్పందానికి రష్యా ఆమోదం..
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) పర్యటనకు ముందే ఆ దేశం కీలక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రెసిప్రొకల్ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS)ను రష్యా ఆమోదించింది. ఇందులో రష్యా సైనిక నిర్మాణాలు, యుద్ధనౌకలు, సైనిక విమానాలను భారతదేశానికి పంపే విధాన్ని నిర్దేశిస్తుంది. ఇరు దేశాల మధ్యనాలాజిస్టికల్ మద్దతును ఈ ఒప్పందం కల్పించనుంది. వీటితో పాటూ సైన్యం తాలూకా శిక్షణ, మానవతా సహాయం, ప్రకృతి, మానవ నిర్మిత విపత్తు సహాయ ప్రయత్నాలలో రష్యా, భారత్..భవిష్యత్తులో ఒకరికొకరు సహకారం అందించుకోనున్నారు. భారత్ తో మా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, సమగ్రమైనవి. మేము వాటిని విలువైనవిగా భావిస్తాము. ఈరోజు చేసుకున్న ఒప్పందంతో ఇరు దేశాలు పరస్పరం మా సంబంధాల అభివృద్ధి వైపు మరొక అడుగు వేస్తామని తాము అర్ధం చేసుకున్నామని రష్యా స్టేట్ డూమా స్పీకర్ వ్యాచెస్లావ్వోలోడిన్ చెప్పారు.
ఇదిలాఉండగా 2021 తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2024లో ప్రధాని మోదీ(PM Modi), పుతిన్(vladimir-putin) రెండుసార్లు సమావేశమయ్యారు. 2024 జులైలో ఇరుదేశాల శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో మోదీ.. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' అందుకున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో రష్యాలో కజాన్‌లోవీళ్లిద్దరూ మళ్లీ భేటీ అయ్యారు. ఇటీవల చైనాలో షాంఘై సహకార సంస్థ సదస్సు జరగగా.. అక్కడ మోదీ, పుతిన్ భేటీ అయ్యి పలు విషయాలపై చర్చలు జరిపారు.
Also Read:India-Pakistan: ఛీఛీ అన్నీ అబద్ధాలే.. పాకిస్తాన్ పై మండిపడ్డ భారత్
Follow Us