Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.

New Update
rupee

ఈ రోజు రూపాయి రికార్డు స్థాయిలో అత్యంత బలహీన స్థాయికి పడిపోయింది. US డాలర్‌(dollors) తో పోలిస్తే ఇది 90కి చేరుకుంది. ప్రపంచ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుండి డబ్బును ఉపసంహరించుకోవడంతో పాటూ చాలా ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం వలన కూడా రూపాయి విలువ పడిపోవడానికి కారణమైంది. రూపాయి పతనం అవుతుందని తెలుసు కానీ మరీ ఇంత వేగంగా పడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, భారత్ వాణిజ్య చర్చలు కూడా ఇంకా పెండింగ్ లో ఉండడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. రూపాయి వాల్యూ ఇంతలా పడిపోవడం వలన వ్యాపారాలు దెబ్బ తినే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక వస్తువులకు విదేశీ రుణాలు ఉన్న కంపెనీలకు తిరిగి చెల్లించే ఖర్చులు పెరుగుతాయిని చెబుతున్నారు. అలాగే విద్యార్థులు, విదేశీ ప్రయాణికులపై డాలర్ పెరుగుదల, రూపాయి పడిపోవడం ప్రభావం తక్షణమే అనుభవిస్తారని తెలిపారు.

Also Read :  ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

వరుసగా మూడో రోజూ నష్టాల్లో..

ఇక వరుసగా మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్(Stock Market) పతనమైంది. సెన్సెక్స్ 250 పాయింట్లు తగ్గి 84,900 వద్ద ట్రేడవగా.. నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి 25,930 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 16 నష్టపోయాయి. నేటి ట్రేడింగ్‌లో ఆటో, బ్యాంకింగ్, FMCG స్టాక్‌లు వెనుకబడి ఉండగా, ఐటీ, మెటల్, ఫార్మాస్యూటికల్ స్టాక్‌లు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా మిశ్రమంగా కొనసాగుతున్నాయి. కొరియా కోస్పి 1.07% పెరిగి 4,037 వద్ద, జపాన్ నిక్కీ 1.13% పెరిగి 49,862 వద్ద, హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.02% తగ్గి 25,828 వద్ద ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్ల విషయానికి వస్తే.. డిసెంబర్ 2న డౌ జోన్స్ 0.39% పెరిగి 47,474 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ కూడా 0.59% పెరిగి 23,414 వద్ద క్లోజ్ అవ్వగా.. S&P 500 0.25% పెరిగి 6,829 వద్ద ముగిసింది.

Also Read: India-Russia: పుతిన్ పర్యటనకు ముందు కీలక ఒప్పందాన్ని ఆమోదించిన రష్యా

Advertisment
తాజా కథనాలు