Afghanistan: 80 వేల మంది చూస్తుండగా మరణశిక్ష..కాల్చి చంపిన 13 ఏళ్ళ బాలుడు

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల రూల్స్ విచిత్రంగా దారుణంగా ఉంటాయి. అక్కడ మరణశిక్షలు విధిస్తే..ప్రజల ఎదురుగానే దాన్ని అమలు చేస్తారు. తాజాగా ఓ నిందితుడిని 80 వేల మంది ఎదురుగా 13 ఏళ్ళ బాలుడు కాల్చి చంపి మరీ మరణశిక్ష అమలు చేశాడు.

New Update
afghan (1)

మా రూల్స్ మా ఇష్టం అంటారు తాలిబాన్లు. అక్కడ కోర్టుల్లో విధించిన శిక్షలను కూడా బహిరంగంగా విధిస్తారు. తాలిబన్ల పాలనలో బహిరంగ మరణశిక్షలు సర్వ సాధారణం. ఇప్పటికి వారు 12 మందిని ఈ విధంగా శిక్షించారు. రీసెంట్ గా ఇలానే మరో మరణశిక్షను అమలు చేశారు. అయితే ఈ సారి మరీ దారుణంగా 13 ఏళ్ళ బాలుడి చేత దీన్ని చేయించారు.

అందరూ చూస్తుండగా తుపాకీతో కాల్చేశాడు.. 

తూర్పు ఆఫ్ఘాన్ లో అదొక పెద్ద స్టేడియం. అక్కడ మొత్తం 80 వేలమందిప్రజలున్నారు. అందరి మధ్యలో ఓ 13 ఏళ్ళ బాలుడు తన ఎదురుగా ఉన్న వ్యక్తి గుండెల్లో గురి చూసి కాల్చాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇది చూసిన చుట్టూ ఉన్న జనం చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేశారు. చచ్చిన వ్యక్తి 12 హత్యలు చేసిన హంతకుడు. మంగల్‌ అనే వ్యక్తి తూర్పు ఆఫ్గానిస్థాన్‌లోనిఖోస్ట్‌లో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేశాడు. ఇందులో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు. అందుకే మంగల్ కు అక్కడి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనిని కాల్చి చంపిన బాలుడు కూడా బాధిత కుటుంబానికి చెందినవాడే. అందుకే ఆ పిల్లాడి చేతనే మరణశిక్ష అమలు అయ్యేలా చేశారు.

ఇదిప్రతీకార శిక్ష..

మరణశిక్ష పడిన వ్యక్తి అత్యంత కిరాతకుడే..కాదనే వారు ఎవరూ లరే. చంపిన బాలుడు కూడా బాధితుడే..అదీ కాదనలేము. కానీ అంత చిన్న పిల్లాడి చేత తుపాకీ పట్టించడమే తప్పు అంటే..అతని చేత కాల్పించడం మరీ తప్పు అని అంటున్నారు. ఈ మరణశిక్ష పై ప్రపంచ దేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు 'అమానవీయం' అని ఖండించారు. ఇది అత్యంత క్రూరమైన అమానవీయ అసాధారణ శిక్ష అని.. ఈ తీర్పు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని రిచర్డ్ బెన్నెట్ అన్నారు. ఈ శిక్షను చూడటానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ మరణశిక్షను కోర్టు 'ప్రతీకార శిక్ష'గా అభివర్ణించింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. ఇలా శిక్షలను అమలు చేస్తే భవిష్యత్తులో మరొకరు నేరం చేయకుండా ఉంటారని అక్కడి ప్రజలు కూడా దీన్ని సమర్థిస్తున్నారు. ఇకపై ఎవరూ ఎవరినీ చంపడానికి సాహసించరు అనిఖోస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటున్నాడు. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలని అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేశారని తెలిపాడు.

తాలిబన్ల పాలనలో బహిరంగ మరణశిక్షలు సర్వసాధారణం. 2021లో వీరు అధికారం చేపట్టిన దగ్గర నుంచీ ఇది 12వ బహిరంగ మరణశిక్ష. దీనికి ముందు అక్టోబర్‌లో బాధిస్‌లో ఇలానే మరణశిక్ష అమలు చేశారు. హత్యలకే కాదు ఈ దేశంలో దొంగతనం, వ్యభిచారం, మద్యం సేవించడం వంటి నేరాలకు తాలిబన్లు ఇప్పటికీ కొరడాలతో కొట్టడం వంటి శారీరక శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే ఈ బహిరంగ మరణశిక్షలకు కందహార్‌లో ఉన్న తాలిబన్ల సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదం తప్పనిసరి.

Advertisment
తాజా కథనాలు