/rtv/media/media_files/2025/12/04/team-india-2025-12-04-07-04-19.jpg)
రాయ్ పూర్ వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. టీమిండియా అందించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానేసఫారీలు ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత బ్యాటర్లురుతురాజ్ గైక్వాడ్, కోహ్లీలు చేసిన సెంచరీలు వృదా అయ్యాయి. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు, ఫీల్డర్లు విఫలమవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్ళ చెత్త ఫీల్డింగ్ విజయావకాశాలను దెబ్బ తీసింది. బౌండరీ లైన్ వద్ద ఎయిడెన్మర్కరమ్ ఈజీ క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ డ్రాప్ చేశాడు. మర్కరమ్ హాఫ్ సెంచరీ తర్వాత సిక్సర్‌కు ప్రయత్నించాడు అయితే అది నేరుగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఆ క్యాచ్‌ను జైస్వాల్ వదిలేశాడు. ఆ సమయంలో మార్కరమ్ స్కోర్ 53 పరుగులు దగ్గర ఉన్నాడు. దీని తరువాత అతను సెంచరీ చేశాడు. ఇక వాతావరణంలో తేమ కూడా ఫీలర్ల వైఫల్యానికి కారణం అయింది. దీని వలన బౌండరీ లైన్ వద్ద బాల్‌ని అంచనా వేయడంలో భారత ఫీల్డర్లు విఫలమయ్యారు. దీంతో సఫారీలకు బోలెడు పరుగులు వచ్చాయి. రవీంద్ర జడేజా లాంటి ఫీల్డర్లు సైతం మిస్టేక్స్ చేయడం సౌతాఫ్రికాకుకలిసొచ్చింది.
బౌలర్లూ నిరాశపర్చారు..
మరోవైపు ఈ మ్యాచ్ లో పేసర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. అర్షదీప్మినహా మిగతా వారందరూ ఫెయిల్ అయ్యారు. మొదటి వన్డేలో విజృంభించిన కుల్దీప్ కూడా ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. పైగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఏకంగా ఓవర్‌కి 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్షిత్ రాణా కూడా ఏడు పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, హర్షిత్ రాణా 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్, అర్ష్‌దీప్ సింగ్ 54 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
టాస్ కు ఓటమిలో బాధ్యత..
ఇవన్నీ ఒక ఎత్తైతే టాస్ కూడా టీమ్ ఇండియా మీద పగ బట్టింది. గెలవాల్సిన మ్యాచ్ లలో కూడా టాస్ ఓటమి కారణంగా ఓడిపోతున్నారు. ఫార్మాట్ లు మారుతున్నాయి, కెప్టెన్లు మారుతున్నారు కానీ..టాస్ విషయంలో టీమ్ ఇండియా ఫేట్ మాత్రం మారడం లేదు. నిన్న సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ తో కలిపి వరుసగా భారత్ 20 సార్లు టాస్ ఓడింది. ఒకట్రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ ఇలా వరుసగా 20 సార్లు అంటే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. టాస్ గెలవకపోవడం కెప్టెన్ల చేతుల్లో లేకపోయినప్పటికీ..ఇది మ్యాచ్ ను నిర్దేశించడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. నిన్న సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం వల్లనే...తరువాత బ్యాటింగ్ చేసేటప్పుడు మంచు ఎఫెక్ట్ కలిసొచ్చి మ్యాచ్ గెలిచింది.
Follow Us