/rtv/media/media_files/2025/12/04/avm-2025-12-04-08-15-58.jpg)
ఏవీఏంస్టూడియో అధినేత, లెజండరీ నిర్మాత ఎం. శరవణన్ కన్నుమూశారు. వయసు మీద పడడంతో పాటూ కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతూనే శరవణన్ తుది శ్వాస విడిచారు.
ఏవీఎంశరవణన్ పెద్ద నిర్మాత. ఈయన తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా సినిమాలు నిర్మించారు. తెలుగులో ఆ ఒక్కటీ అడక్కు, సంసారం ఒక చదరంగం, లీడర్ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. ఏవీఎంశరవణన్ తండ్రి ఏవీ మెయప్పన్..1945లో 'ఏవీఎమ్ ప్రొడక్షన్స్' బ్యానర్ స్థాపించారు. ఈ సంస్థలో ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులతో సినిమాలు చేశారు. మెయప్పన్ తర్వాత శరవణన్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్గుహాన్ కూడా ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నారు.
Follow Us