లడ్డులో కల్తీ నెయ్యి ఎక్కడిది ? | Tirumala Laddu Issue | SIT Enquiry | Tirumala | RTV
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీల బృందం తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కలిసి వివరాలు తీసుకున్నారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణను చేపడుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కమిటీ విచారిస్తోంది. త్వరలోనే నిజాలు బయటపడనున్నాయి.
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన లడ్డూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ఇండియా టుడే దీనిపై శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి విచారణ జరిపింది. కాగా రిపోర్టులో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్ షాక్ తగలింది. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 22న పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినియోగిస్తున్న విజయ డెయిరీ నెయ్యి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. దీంతో ఈ నెయ్యి స్వచ్ఛమైనదని, తేమ, ఒలేయిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు పరిమితంగా ఉన్నాయని తేలింది.
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యికి చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీ ఉండాలని, ఇందుకోసం వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తానన్నాడు. లక్ష ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానన్నారు.