పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్ షాక్ తగలింది. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 22న పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. By B Aravind 21 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బిగ్ షాక్ తగలింది. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరిలో అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ కల్యాన్ వ్యాఖ్యానించారని.. లడ్డూ తయారీలో జంతు కొవ్వు పదార్థాలు కలిసినట్లు ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్ 91 ప్రకారం పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. Also Read: ఏపీలో ఊహించని రాజకీయ పరిణామం.. రాజీకీ వచ్చిన జగన్, షర్మిల ! పవన్ కల్యాణ్ రావాలి ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 22న పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. అలాగే తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్‌కు కూడా సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. అయితే పవన్ కల్యాణ్ కోర్టుకు వెళ్తారా ? లేదా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. సంచలనంగా మారిన లడ్డూ వివాదం ఇదిలాఉండగా.. ఇటీవల తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ల్యాబ్ రిపోర్టులో కూడా నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలింది. ఈ కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు కలిపే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై పవన్ కల్యాణ్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. లడ్డూలో జంతు కొవ్వు కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ తిరుపతి వేదికగా నిర్వహించిన సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో 4 లైన్ల హైవే.. ఇక సాఫీగా జర్నీ మరోవైపు ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. లడ్డూ విషయంలో నిజ నిజాలు తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఎలా ప్రకటన చేస్తారంటూ న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఒక ల్యాబ్ రిపోర్టు వచ్చినప్పుడు రెండోసారి ఒపినియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ హితువు పలికింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కల్తీ జరిగినట్లు చెబుతున్న నెయ్యి ట్యాంకర్‌కు పర్మిషన్ ఇవ్వలేదని టీటీడీ చెబుతుంటే.. సీఎం ప్రకటన ఎందుకు భిన్నంగా ఉందని సుప్రీంకోర్టు నిలదీసింది. కల్తీ విషయంలో క్లారిటీ లేకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. #pawan-kalyan #tirupati #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి