Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?

శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు

New Update
sabarimala

Sabarimala : యావత్‌ దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డూ అంశం ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు మరో ఆలయ ప్రసాదంలో  కల్తీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గతేడాదిగా వాడకుండా ఉంది. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణల వల్లే వీటి వాడకాన్ని ఆపేశారు. 

Also Read: ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ

ఈ ప్రసాదాల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు, ఈ ప్రసాదాలను శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు  టీడీబీ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌ను ఇండియన్‌ సెంట్రిఫ్యుజ్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ దక్కించుకున్నారని, వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్‌ ప్రశాంత్‌ తెలిపారు.

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్.. ఎక్కడుందో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు