Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం.. విచారణ ప్రారంభించిన సీట్!

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్‌ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీల బృందం తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కలిసి వివరాలు తీసుకున్నారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. 

New Update
Laddu 3

Tirupati : తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్‌ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణస్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్య తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును శుక్రవారం కలిసి వివరాలు తీసుకున్నారు. వీరు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన సిట్‌ కార్యాలయం నుంచి సోమవారం పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. 

ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!

నాలుగు బృందాలుగా ఏర్పడిన డీఎస్పీలు..

ఇందులో భాగంగా నాలుగు బృందాలుగా ఏర్పడిన డీఎస్పీలు టీటీడీ పాలక మండలి తీర్మానాలు, అధికారులు, సిబ్బంది గురించి పర్యవేక్షించనున్నారు. దర్యాప్తులో ఈ బృందానికి సహకరించేందుకు కొందరు పోలీస్‌ అధికారులను నియమించారు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటుచేసిన సిట్‌ బృందంలో సభ్యుడిగా ఉన్న వెంకట్రావు.. ఇప్పటికే ప్రాథమిక నివేదిక తయారు చేశారు. దీంతో వెంకట్రావును దర్యాప్తు బృందంలోకీ తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్..

ఇక ఈ విచారణలో భాగంగా మొదటగా నెయ్యి సరఫరా చేసిన దుండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థను సిట్‌ సభ్యులు పరిశీలించనున్నారు. ఏఆర్‌ డెయిరీ నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా మరో సంస్థ నుంచి సేకరించి సరాఫరా చేసినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. మరో బృందం తిరుమల లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, తయారీకి వినియోగించే ముడి సరకుల నాణ్యతకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించనుంది. 

ఇది కూడా చదవండి: గ్రూప్‌-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్

ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి

Advertisment
తాజా కథనాలు