తిరుపతికి లక్ష ఆవులు.. ఉచితంగా ఇస్తానంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు!

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యికి చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీ ఉండాలని, ఇందుకోసం వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తానన్నాడు. లక్ష ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానన్నారు.

New Update
deedeedre

 Tirupathi: తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ బీసీవై (భారత చైతన్య యువజన పార్టీ) పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బయటనుంచి వచ్చే నెయ్యి కల్తీ సమస్యలకు చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం తన తరఫున లక్ష ఆవులను ఉచితంగా ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. 

రోజుకు 30 వేల కిలోల నెయ్యి..

ఈ మేరకు 'రోజుకు లక్ష మంది భక్తులు తిరుపతిని దర్శించుకుంటున్నారు. రూ.5 కోట్ల ఆదాయం వస్తోంది. అలాంటపుడు తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేం? ప్రభుత్వం దీనికి రెడీగా ఉంటే నా తరఫున 1000 ఆవులను ఉచితంగా ఇస్తా. మరో లక్ష ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటా. లక్ష ఆవులతో రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయొచ్చు. దీంతో రోజుకు 50 వేల కిలోల వెన్న, 30 వేల కిలోల నెయ్యి  తీసుకోవచ్చు. ఇక్కడికి సరిపోను మిగతా నెయ్యి రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపింస్తే కల్తీ నెయ్యి సమస్య తిరుతుంది' అంటూ లేఖలో పేర్కొన్నారు. 

ఏడుకొండలు అపవిత్రమయ్యాయి..

అలాగే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలను రాజకీయ, పునరావాస, వ్యాపార, కార్పొరేట్‌ కేంద్రాలుగా చూడరాదన్నారు. టీటీడీ పాలకమండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్‌ రంగాలవారు వ్యక్తులు కాకుండా ఛైర్మన్‌ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడగలరని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల అరాచకాలతో ఏడుకొండలు అపవిత్రమయ్యాయని, ఇప్పటికైనా పవిత్రత కాపాడేందుకు తను సూచించిన మార్గం పరిగణలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు