Temples: తెరుచుకున్న ఆలయాలు..పోటెత్తిన భక్తులు
సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం మూత పడిన పలు దేవాలయాలు సోమవారం తెరుచుకున్నాయి. గ్రహణ సమయం ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు తెరుచుకున్నాయి. దీంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో సందడి నెలకొంది.