Crime News :  తిరుపతిలో మృతదేహాలు కలకలం...!

తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను సోమవారం గుర్తించారు.

New Update
FotoJet - 2025-12-02T084507.318

Dead bodies in Tirupati

Crime News :  తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూరు సమీపంలోని ఓ ఇంటిలో మూడు మృతదేహాలు బయటపడడంతో కలకలం చెలరేగింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహాలలో కుళ్లిన స్థితిలో ఉన్న ముగ్గురి మృతదేహాలను సోమవారం గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం, గుడియాత్తంకు చెందిన సత్యరాజ్(30) తన భార్యను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టె నాయగి (30) అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

మూడు నెలలు క్రితం గుడియాత్తం నుంచి వచ్చిన సత్యరాజ్ స్థానిక ఇందిరమ్మ ఇళ్లల్లో కాపురం పెట్టాడు. పొంగొటైతో పాటు ఈమె మూడేళ్ల కుమారుడు మనీష్‌ (3)తో కలిసి అక్కడే ఉంటున్నాడు. స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈనెల 22న ఉదయం నుంచి ఈ జంట బయట కనిపించలేదు. అదే క్రమంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గుర్తించి తిరుచానూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అరుణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి చూడగా మూడు మృతదేహాలు బయటపడ్డాయి.

 సత్యరాజ్‌ ఉరికి వేలాడుతుండగా... పొంగొటై, మనీష్‌ మృతదేహాలు గదిలోని వాష్‌ రూమ్‌ వద్ద పడి ఉన్నాయి. ఆ శవాలకు సమీపంలో విషం సీసా లభ్యం కావడంతో ముందుగా పొంగొటై, ఆమె కుమారుడు విషం తాగి చనిపోయి ఉంటారని.. తరువాత సత్యరాజ్‌ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు మహిళను, ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా....? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో దామినేడు గృహాల్లో ఒక్కసారిగా కలకలం లేపింది. 

Advertisment
తాజా కథనాలు