/rtv/media/media_files/2025/08/24/shamshabad-airport-2025-08-24-17-30-28.jpg)
Shamshabad Airport
Shamshabad Airport : దేశవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా అలయన్స్ ఎయిర్ లైన్స్ రన్-వే పైనే నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణీకులను సైతం రన్‌వేపై నిలిపివేశారు. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఈ అలయన్స్ విమానం దాదాపు గంట సేపు పైగానే రన్ వే పైనే ఉండిపోయింది. ప్రయాణీకుల సమాచారం ప్రకారం విమానం రన్‌వేపై నుండి బయలు దేరాల్సి ఉండగా మూడు సార్లు సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని అక్కడే నిలిపివేశాడు. ఈ ఘటనతో ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణీకులు కిందకు దిగారు.
Also Read : ఖాళీ కడుపుతో ఈ 8 పదార్థాలు తీసుకుంటున్నారా.. ఇక డేంజర్‌లోనే మీ ప్రాణాలు!
అయితే ఈ సాంకేతిక సమస్య తలెత్తిన సమయంలో విమానంలో సుమారు 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. సాంకేతిక లోపం కారణంగా విమానం దిగిన ప్రయాణికులు సిబ్బందితో ఘర్షణకు దిగారు.
ఫ్లయిట్ స్టార్ట్ అయ్యే ముందు సాంకేతిక లోపాలను ముందుగా చూసుకోవడం తెలిదా అంటూ సంబంధిత ఎయిర్ లైన్స్ పై మండిపడ్డారు. సిబ్బంది నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఎయిర్ ఫోర్ట్ సిబ్బందిని నిలదీశారు.
Also Read: ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ
కాగా వారం రోజుల క్రితం కూడా ఇదే అలియన్స్‌కు చెందిన తిరుపతి విమానంలో సేమ్ సీన్ రిఫిట్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్లాబ్లమ్ తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గతంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరిచిపోకముందే చాలా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. ఈ ఘటనలు ప్రయాణికులను భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్