/rtv/media/media_files/2025/07/12/vinutha-2025-07-12-19-24-14.jpg)
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును శ్రీకాళహస్తిలోనే హత్య చేసిన నిందితులు చెన్నై శివారు కాలువలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో జనసేన నాయకురాలు వినూత, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ థాసన్ లను అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు వివరించారు.
గత నెలలో డ్రైవర్ రాయుడుని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసిన వినూత కోట
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2025
బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు
అయితే జూన్ 21వ తేదీన అతను… https://t.co/yh4RPxb9Zfpic.twitter.com/QSTDeya2Or
వినూత గత నెలలో డ్రైవర్ రాయుడుని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ రాయుడు కొంతకాలంగా వినూత కోట దగ్గర నమ్మిన బంటుగా, డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే జూన్ 21న అతను చేసిన అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించాడు. రాయుడిని పనిలో నుంచి తొలగిస్తున్నట్లు వినూత కోట పోస్ట్ చేసింది. ఇక మీదట డ్రైవర్ రాయుడికి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో ఆమె పేర్కొంది.