Khammam News: మున్నేరు వాగు ఉగ్రరూపం.. వరదల్లో చిక్కుకున్న ఐదుగురు కాపరులను కాపాడిన NDRF
ఖమ్మం జిల్లా మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చింది. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్నమండవ సమీపంలో మున్నేరు వాగు ఐదుగురు పశువుల కాపరులు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమయస్పూర్తితో వారిని బయటకు తీసుకువచ్చారు.