Khammam News
Khammam News: ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా చిన్న మండవ సమీపంలో మున్నేరు వాగు ప్రవాహం ప్రమాదకరంగా మారింది. వరదనీరు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో పశువులను కాసేందుకు వెళ్లిన ఐదుగురు కాపరులు మున్నేరు వాగులో చిక్కుకుపోయారు. ప్రవాహం గట్టి ఉండడంతో వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రాణాలతో బయటపడ్డ ఐదరుగు కాపరులు:
ఈ సమాచారం స్థానికుల ద్వారా అధికారులకు చేరడంతో వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. అత్యవసరంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమయస్పూర్తితో స్పందించారు. బృందాలు పరికరాలతో రెస్క్యూ బోట్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించి బయకు తీసుకువచ్చారు. వరద ప్రవాహాం ఎక్కువగా ఉన్నా పెద్ద సాహసంతో ముందుకు సాగిన బృందం సభ్యులు ఐదుగురు కాపరులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఐదుగురు ప్రాణాలతో బయటకు రావాటంతో కుటుంబం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కంటి ఇన్ఫెక్షన్ ప్రమాదాలు తగ్గుతాయి..!!
ఈ సంఘటన చూసిన స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందాల వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు ఆదుకునే విషయంలో వారి కృషిని మేచ్చుకున్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్ళకూడదని.. ఎలాంటి అప్రమత్తత లేకుండా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వర్షాల ప్రభావంతో మున్నేరు వంటి వాగులు ఊబిలోకి జారుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక బృందాలు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నా.. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రి నెయ్యితో పాలు తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
( TG News | Latest News)
Follow Us