TG News: శ్రీశైలం దారిలో వచ్చే దోమలపెంట, ఈగలపెంట పేర్లు మారాయి.. కొత్త పేర్లు ఏంటో తెలుసా?

శ్రీశైలం వెళ్లే దారిలో ఉన్న ఈగల పెంటను కృష్ణగిరిగా, దోమల పెంటను బ్రహ్మగిరిగా మార్చుతూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజా మార్పులతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బోర్డులను కొత్త పేర్లతో మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

New Update
Villages Names Changed

Villages Names Changed

శ్రీశైలాన్ని దర్శించుకునే భక్తులు ప్రయాణంలో చూడగల కొన్ని ప్రత్యేకమైన గ్రామాల్లో ఈగల పెంట, దోమల పెంట ముఖ్యమైనవి. పేర్లు వింటేనే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గ్రామాలకు కొత్త పేర్లు వచ్చాయి. ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేస్తూ ఈగల పెంటను కృష్ణగిరిగా, దోమల పెంటను బ్రహ్మగిరిగా మార్చుతూ అధికారికంగా ప్రకటించింది. తాజా మార్పులతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బోర్డులను కొత్త పేర్లతో మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి అధికారికంగా నూతన పేర్లనే ఉపయోగించాల్సి ఉంటుంది.

Also Read :  Olympics: కేంద్రం గుడ్‌న్యూస్.. వాళ్లకు నెలకు రూ.50 వేల ఆర్థిక సాయం

శ్రీశైలం మార్గంలో ఉన్న ఊర్లకు కొత్త పేర్లు:

నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని ఈ గ్రామాలు శ్రీశైలం వెళ్లే దారిలో కనిపిస్తాయి. అచ్చంపేట నియోజకవర్గానికి చెందినవి కావడంతో అక్కడి ప్రజలు ఈ మార్పులను స్వాగతిస్తున్నారు. గ్రామాల పాత పేర్లు వింటే టూరిస్టులకు కొంత అసహజంగా అనిపించేది. ఈగలు, దోమల పేర్లు గ్రామాలకు ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలిసే అవకాశం కూడా లేదు. కానీ పేర్లు వినగానే ఒక్కసారిగా నవ్వు వచ్చేది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొత్త పేర్లను ఖరారు చేసింది. కృష్ణగిరి, బ్రహ్మగిరి అనే పేర్లు ఆ ప్రాంత ప్రతిష్టను పెంచుతాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శివ పిడికిలి అంటే తెలుసా..? దాని ప్రాముఖ్యత తెలుసుకోండి

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. గ్రామాల పేర్లను మార్చే అధికారాన్ని ప్రభుత్వం కలిగి ఉంటుంది. అందులో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్ణయించిన పేర్లను అన్ని శాఖలలో అమలు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై ఎలాంటి ప్రభుత్వ పత్రాల్లోనైనా పాత పేర్ల స్థానంలో కృష్ణగిరి, బ్రహ్మగిరి అనే పేర్లే ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. ఈ మార్పుతో శ్రీశైలం మార్గంలోని ఈ గ్రామాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుందని, పర్యాటకులకు కూడా మరింత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించ గలగడమే లక్ష్యమని చెప్పారు.

ఇది కూడా చదవండి: బరువు తగ్గాలని ఖాళీ కడుపుతో ఈ నీరు తాగుతున్నారా..? కలిగే హానికరమైన ప్రభావాలు

Also Read :  సైకో, శాడిస్ట్, ఎవడో.. ఎవరి అండతో ధైర్యం చేశావో.. బీ కేర్ ఫుల్ బిడ్డా : ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు


( Latest News | TG News)

Advertisment
Advertisment
తాజా కథనాలు