/rtv/media/media_files/2024/12/26/ZoTc1GtkSS4onxfhiuwp.jpg)
CM Revanth
తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్ల వాడకంపై విచారణ చేపట్టేందుకు గృహ నిర్మాణశాఖ ముందుకొచ్చింది. లబ్ధిదారులు ఇళ్లలో ఉంటున్నారా? లేదంటే ఇతరులకు అద్దెకు ఇచ్చారా? లేకపోతే అనధికారికంగా విక్రయించారా? లేదా వేరే అవసరాలకు వాడుతున్నారా? అనే అంశాలపై స్పష్టత తెచ్చేందుకు హౌసింగ్ కాలనీస్ ఇన్‌స్పెక్షన్ అనే మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా సిబ్బంది ప్రత్యక్షంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నివాస పరిస్థితులను నమోదు చేస్తారు.
Also Read : కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
డబుల్ బెడ్రూం ఇళ్లపై తనిఖీలు..
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో బ్లాక్ విధానంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లకే ఈ యాప్ వర్తించనుంది. ప్రాథమికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్, చెంగిచెర్లలో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగించి తనిఖీలు నిర్వహించారు. బోడుప్పల్‌లోని 74 ఇళ్లు, చెంగిచెర్లలోని 39 ఇళ్లకు సిబ్బంది వెళ్లి గృహాలలో లబ్ధిదారులే నివసిస్తున్నారా లేదా అనే సమాచారం సేకరించారు. ఈ ప్రాంతాల్లో ప్రయోగం విజయవంతంగా జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చదవండి: భోజనం తర్వాత యాలకులు తింటే అనేక లాభాలు.. పచ్చి యాలకుల ప్రయోజనాలు తెలుసుకోండి
గతలో 2.36 లక్షల బుల్ బెడ్రూంల ఇళ్లను మంజూరు చేయగా అందులో 1.58 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తైనట్లు తెలుస్తోంది. వీటిలో 1.36 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. అయితే వివిధ జిల్లాల నుంచి ఈ ఇళ్లను వాస్తవ లబ్ధిదారులు కాకుండా సొంత ఇళ్లు ఉన్నవారే పొందారనే ఫిర్యాదులు అందుతున్నాయి. వారు ఈ ఇళ్లను అద్దెకు ఇచ్చి తామెక్కడో వేరే చోట నివసిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ఇతర జిల్లాల్లో రెవెన్యూ మరియు పంచాయతీ సిబ్బందికి ఈ సర్వే బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ చర్యల ద్వారా అసలు లబ్ధిదారులు ఎవరో.. ప్రభుత్వ ఇళ్లను నిజంగా ఎవరు ఉపయోగిస్తున్నారు అన్నది స్పష్టమవుతుంది. తద్వారా ప్రభుత్వ సహాయం న్యాయమైనవారికే అందేలా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మీ ఆరోగ్యం కోసం.. నిద్ర భంగిమ ఎలా ఉండాలో తెలుసా..?
యాప్‌లో వివరాల నమోదు ఇలా...
హౌసింగ్ కాలనీస్ ఇన్‌స్పెక్షన్ మొబైల్ యాప్ ద్వారా సిబ్బంది ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నేరుగా వెళ్తారు. అక్కడ లబ్ధిదారులు ఉన్నారా, లేదా అనే వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇంటికి తాళం వేసి ఉంటే.. ఎన్ని రోజుల నుంచి అలా ఉందో తెలుసుకుని అందుకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు, లబ్ధిదారుడు అయితే వారి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. వారికి కేటాయించిన ఇంటి పట్టాను కూడా పరిశీలిస్తారు. ఒకవేళ ఇంట్లో ఇతరులు అద్దెకు నివసిస్తుంటే, వారి వివరాలు, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారనే సమాచారాన్ని సేకరిస్తారు. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించనట్లయితే వారికి నోటీసులు జారీ చేసి.. వారి నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతారు.
Also Read : టెన్త్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఇన్‌స్టా చాటింగ్.. హైదరాబాద్ లో పెను విషాదం!
( TG News | double-bedroom-houses | double bedroom houses in hyderabad | CM Revanth Reddy Announces Double Bedroom Houses | Latest News | telugu-news )