/rtv/media/media_files/2025/10/31/accident-2025-10-31-11-02-03.jpg)
Accident
TG NEWS: హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్ క్రాస్ రోడ్డు దగ్గర పెళ్లి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బోర్ బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్ MGM ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పెళ్ళికి వెళ్తున్న బొలేరో వాహనం రోడ్డు పక్కన ఆగి ఉండగా.. బోర్ వెల్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను మహబూబాద్ జిల్లా కురవి మండలం సుదన్ పల్లి గ్రామస్థులుగా గుర్తించారు.
Follow Us