/rtv/media/media_files/2025/08/21/secunderabad-railway-2025-08-21-15-52-00.jpg)
Secunderabad railway
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ రైల్వే చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతోంది. పాత భవనాలను కూల్చివేసి, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. కొత్త డిజైన్‌లో భాగంగా మల్టీ-లెవెల్ కార్ పార్కింగ్, స్కై కాన్‌కోర్స్, విశాలమైన రూఫ్ ప్లాజా, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు వంటివి అందుబాటులోకి వస్తాయి. ఈ పనులను 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో పూర్తి చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు నేపథ్యంలో కొన్ని రైళ్లను దాని మళ్లించిన విషయం తేలిందే. తాజా మరో 30 రైళ్ళను సికింద్రాబాద్ నుంచి దారి మళ్లించారు. ఆ విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.30 రైళ్లు దారి మళ్లింపు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగనుంది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సుమారు 30 రైళ్లను హైదరాబాద్‌లోని ఇతర స్టేషన్లకు తరలించారు. దారి మళ్లింపులో భాగంగా సికింద్రాబాద్-పోర్ బందర్ సర్వీస్ హల్ద్వానీనగర్ నుంచి, పూణే-సికింద్రాబాద్ సర్వీస్ హైదరాబాద్ స్టేషన్ నుంచి, సిద్ధిపేట-సికింద్రాబాద్ సర్వీస్ మల్కాజిగిరి నుంచి బయలుదేరతాయి. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి బయలుదేరే పది ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాత్కాలికంగా చేర్యాలపల్లికి మళ్లించబడ్డాయి. ఇందులో సికింద్రాబాద్-రేపల్లె, సికింద్రాబాద్-మణుగూరు, సికింద్రాబాద్-రామేశ్వరం, సికింద్రాబాద్-సిల్చార్, సికింద్రాబాద్-ముజఫర్‌పూర్, సికింద్రాబాద్-శాంత్రగాచి, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-దర్భాంగ, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్-అగర్తలా రైళ్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా
రోజుకు 80 ఎక్స్‌ప్రెస్ మరియు 100 ప్యాసింజర్ రైళ్లు వచ్చిపోయే సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సంఖ్య రోజుకు 2 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య 3.5 లక్షలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ రూ. 720 కోట్లతో ఆధునీకరణ పనులను చేపట్టింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో స్టేషన్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్‌లో షాపులు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కేంద్రాలు, వేచి ఉండే హాళ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు నిర్మిస్తున్నారు. G+3 ఫ్లోర్స్‌లో ఈ భవనం నిర్మించబడుతుంది. స్టేషన్ రెండు వైపులా ట్రావెలర్లు, రెండు వాక్‌వేలు, 32 ఎస్కలేటర్లు, రెండు వెడల్పాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తూ స్కైవే కూడా నిర్మించబడుతుంది. ఆధునీకరణ పనుల కారణంగా ప్రయాణికులు ఎదురైన అసౌకర్యానికి రైల్వే అధికారులు క్షమాపణలు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఉచిత బియ్యంతో పాటు ప్రత్యేక సంచుల్లో సంక్షేమ పథకాలు