Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు శివుడిని ఇలా పూజిస్తే.. పుణ్యం మీ సొంతం
మహా శివరాత్రి నాడు ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. వీలైతే రుద్రాభిషేకం లేకపోతే పంచామృతాలతో అయినా అభిషేకం చేయాలి. ముత్యాలు లేదా బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
Photoshoot Controversy in Tirumala : శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్ వివాదం..
తిరుమలలో ఫొటోషూట్ మరోసారి వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు పలువురు ప్రైవేటు కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు కెమెరాలతో హల్ చల్ చేశారు. బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు మహా ద్వారం ముందు కెమెరాలతో ఫోటోషూట్ చేశారు.
Srisailam: శ్రీశైలం ఆలయంలో కొట్లాట.. ఈవో Vs అర్చకులు!
శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు.
TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు.
కొత్త సంవత్సరం ఇలా చేస్తే.. పట్టిందల్లా బంగారమే | Huge Devotees In Chilkur Balaji Temple | RTV
Madhya Pradesh: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు
మధ్యప్రదేశ్లో ఖాండ్వా జిల్లాలోని భామ్గఢ్ గ్రామంలో 500 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే గుడి కాలిపోయింది. దేవుని విగ్రహాలు కూడా కాలి దెబ్బతిన్నాయి.
BIG BREAKING: వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముందు అపచారం జరిగింది. పుట్టినరోజు, క్రిస్మస్ వేడకల సందర్భంగా కొందరు మాంసాహారం ప్యాకెట్లను పంచడం సంచలనంగా మారింది. గుడి ప్రాంగణంలో మాంసాహారం నిషేధం ఉన్నప్పటికీ ఇలా జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది
పురాతన ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. సన్వాలియా సేథ్ ఆలయ హుండీ లెక్కించారు. కేజీ బంగారం, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఇంకా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ నుంచి 40 కిలో మీటర్లలో చిత్తోర్ గఢ్ ఉదయ్ పూర్ హైవే పై ఉంది.