/rtv/media/media_files/2025/01/25/PtgHAb0mi5H3BTn6F7zT.jpg)
Photoshoot Controversy in Tirumala
Photoshoot Controversy in Tirumala :తిరుమలలో ఫొటోషూట్ మరోసారి వివాదంగా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు పలువురు ప్రైవేటు కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు కెమెరాలతో హల్ చల్ చేశారు. ఆలయ మహా ద్వారం ముందు, గొల్ల మండపం ఎదురుగా కెమెరాలతో ఫోటోషూట్ చేశారు.
ఇది కూడా చదవండి: TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!
బళ్లారి సిట్టింగ్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి బావమరిదికి హీరో నితిన్ మేనకోడలితో శుక్రవారం తిరుపతిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సందర్భంగా నారా భరత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉదయం శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారితో పాటు ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు కూడా వచ్చారు. దర్శనం అనంతరం వారంతా తమ ఫోటోగ్రాఫర్లతో అక్కడ ఫోటోలు తీసుకున్నారు.శ్రీవారి ఆలయంలో ఫోటోషూట్‌లు చేయకుడదని నిబంధన ఉన్నప్పటికీ అదేం పట్టించుకోకుండా ఫోటోషూట్ చేయడం వివాదంగా మారింది.
తిరుమల శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక ప్రదేశం అని.. ఇక పై ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్స్, రాజకీయ ప్రసంగాలు వంటివి వాటిని అనుమతించమని.. అలా చేసినవారిపై కొండ దిగేలోపు కేసు నమోదు అవుతుందని కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు హెచ్చరించింది.. ఈ విషయంఫై ఓ వైపు చర్చనడుస్తూనే ఉంది.. తాజాగా శ్రీవారి ఆలయ సమీపంలో నారా భరత్ రెడ్డి కుటంబ సభ్యులు ఫోటోలు తీసుకున్నారు.
ఇదే సమయంలో... ఇప్పటికే పవిత్రమైన కొండపై ఫోటో షూట్ లు, సోషల్ మీడియా రీల్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Yamini: హిందువా? ముస్లిమా? అద్దె ఇంటి కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
ఈ నేపథ్యంలో మరోసారి తిరుమల కొండపై ఫోటో షూట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలోనూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆలయం ఎదుట ఫోటోలు దిగి హల్‌చల్ చేశారు. ఈ విషయం చాలాసార్లు వివాదస్పదంగా మారినప్పటికీ రాజకీయనాయకులు తిరిగి అదే తప్పు పదేపదే చేయడం పట్ల శ్రీవారి భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.