/rtv/media/media_files/2025/04/13/nodNhkZLzIlrozAs6DRz.jpg)
temple
ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి వేళ వచ్చిన కొందరు వ్యక్తులు.. తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని, ఆగమశాస్త్రానికి విరుద్దమని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన గుంపు.. పూజారిపై దాడికి దిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో చోటుచేసుకుంది. సుమారు 30 మంది వ్యక్తుల గుంపు తమను లోపలికి అనుమతించనందుకు పూజారి మీద దాడిచేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
Also Read: NewYork: న్యూయార్క్ లో విమాన ప్రమాదం...!
ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాతా టెక్రి ఆలయంలో జరిగిందని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో నేర చరిత్ర ఉన్న జీతూ రఘువంశీ అనే వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి సుమారు 30 మందితో కలిసి ఎనిమిది నుంచి పది కార్లలో ఆలయానికి వచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొండపై ఉన్న ఆలయం వద్దకు చేరుకున్న కాన్వాయ్‌లోని కొన్ని కార్లకు ఎర్రటి లైట్లు కూడా ఉన్నాయి. వారు తరువాత ఆలయం లోపల ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించారు.
Mata Tekri Temple Priest Incident
‘మేము అర్ధరాత్రికి ఆలయ తలుపులు మూసివేస్తాం... జీతూ రఘువంశీ నేతృత్వంలోని గుంపు రాత్రి 12:40 గంటలకు మా వద్దకు వచ్చింది. అప్పటికే నేను గుడి తలుపులు మూసివేశాను. ఆలయం మూసివేసినట్టు నేను వారికి చెప్పడంతో ద్వారాలు తెరవమని నన్ను బలవంతం చేశారు.. నన్ను చంపుతామని బెదిరించారు.. వారు నన్ను కొట్టారు’’ అని పూజారి తెలిపారు.
దేవాస్ సిటీ ఎస్పీ దినేష్ అగర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ..పూజారి ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలోని సుమారు 50 కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే, బీజేపీ నేత కుమారుడు ఈ గుంపునకు నాయకత్వం వహించి, వారిని తీసుకుని వచ్చాడా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కేసు దర్యాప్తులో ఉందని అగర్వాల్ సమాధానం తెలిపారు.
Also Read:Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
latest telugu news updates | latest-telugu-news | telugu-news | again temple attack | madhya pradesh news | today-news-in-telugu | national news in Telugu