మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..
భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.